Who kidnapped ramulamma

who kidnapped ramulamma? local elections, ramulamma, cheeded in manchala mandal, ranga reddy district, june 25, cpm,

Who kidnapped Ramulamma?

పంచాయితీ ఎన్నికలు … రాములమ్మ కిడ్నాప్!

Posted: 07/03/2013 01:13 PM IST
Who kidnapped ramulamma

రాములమ్మ కిడ్నాప్ అంటే తెలంగాణ రాములమ్మ కాదులేండి. ఓ మహిళ సర్పంచ్ అయ్యే అవకాశం ఉందని ఏకంగా ఆమెను కిడ్నాప్ చేశారు. గ్రామానికి చెందిన తొమ్మిదిమంది గతనెల 24న తమ తల్లిని కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా చీదేడ్‌లో ఈ సంఘటన జరిగింది. 796 ఓట్లున్న చీదేడ్ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీమహిళలకు కేటాయించారు. గ్రామంలో ఐదు ఎస్టీ ఓట్లున్నాయి. వారిలో రాములమ్మకే పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంది. దీంతో ఆమె సర్పంచ్ అయ్యే అవకాశాలున్నాయని కిడ్నాప్ చేశారు. ఆమెతో పోటీ చేయించేందుకు సీపీఎం వారు కిడ్నాప్‌నకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోడకొండ బ్యాంకు వద్ద పనిఉందని చెప్పి గతనెల 24న తమ తల్లిని గ్రామానికిచెందిన తెల్కపల్లి రామకృష్ణ, మానుపాటు యాదయ్య, సత్యనారాయణ తీసుకెళ్లారని రాములమ్మ కుమార్తెలు భాగ్యమ్మ, సంతోష పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles