Cabinet rejig today

Cabinet rejig today, Major reshuffle in Congress Rahul Gandhi,Jagdish Tytler,Girija Vyas,Ghulam Nabi Azad,Digvijay Singh,CP Joshi,Chhattisgarh,Andhra Pradesh,Ambika Soni,Ajay Maken

Changes in the organization are linked to a comprehensive ministerial reshuffle scheduled for today evening aimed at filling vacancies like railways, highways and housing.

నేడే కేబినెట్ విస్తరణ

Posted: 06/17/2013 09:29 AM IST
Cabinet rejig today

నేటి సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరగబోతుంది. పలువురు డీఎంకె మంత్రులు ఐదుగురి రాజీనామాతో ఖాళీ అయిన ఆ శాఖలతో పాటు మరి కొన్ని ఖాళీలను కూడా పూర్తి చేయడానికి సర్వం సిద్ధం అయింది. దీంతో మన రాష్ట్రానికి చెందిన పలువురు ఆశావాహులలో కొత్త ఆశలు రేకెత్తాయి. పోయిన కేబినెట్ విస్తరణ కొంత మందికి స్థానం దక్కగా, ఈసారి మరికొందరికి కూడా స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  ఈ రేసులో ఏలూరు ఎంపి కావూరి సాంబశివ రావు, జేడీ శీలం ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పునర్వ్యస్థీకరణలో  కేబినెట్‌లో నలుగురు నుంచి ఐదుగురు కేబినెట్ మంత్రులుగా.. ఏడు నుంచి ఎనిమిది మందికి సహాయ మంత్రులుగా చాన్స్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేబినెట్‌లోకి ఆస్కార్ ఫెర్నాండెజ్, మీనాక్షీ నటరాజన్, శీశ్‌రాం ఓలా తదితరులకు అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాలకు చెందిన ఒకరిద్దరికి కూడా అవకాశాలు లభించవచ్చునని తెలుస్తోంది. మార్పుల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శాఖ మారే అవకాశాలు లేకపోలేదని తె లుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కి కేంద్రకేబినేట్‌లో చోటు కల్పించి, ముఖ్యమంత్రిగా అజయ్‌మకాన్‌కు అవకాశం కల్పించవచ్చునని భావిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ సహా పలువురు మంత్రుల శాఖలు మారే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి మరి కొన్ని గంటల్లో ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయో తేలనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles