Political somireddy chandramohan reddy fire on cm kiran

somireddy chandramohan reddy fire on cm kiran, TDP Leader Somireddy, bayyaram mines, ysr-jagan, ys jagan, braman steel, ys rajasekara reddy, k rosaiah, ex chief minister,

somireddy chandramohan reddy fire on cm kiran

జగన్ కు సంబంధించిన జీవోలను రద్దు చెయ్యండి?

Posted: 04/25/2013 06:29 PM IST
Political somireddy chandramohan reddy fire on cm kiran

బ్రాహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూకేటాయింపులను రద్దు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కాదు, దమ్ముంటే జగన్ అక్రమాస్తులకు సంబంధించిన మొత్తం 26 జీవోలనూ రద్దు చేయాలని' తెలుగుదేశం నేత సోమిరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ వేల కోట్లు దోచుకున్నారని స్వయంగా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పినప్పటికీ, దానికి సంబంధించిన ఆ జీవోలను ఎందుకు రద్దు చేయరని ఆయన ప్రశ్నించారు. తండ్రిపై ఒత్తిడి తెచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన అన్నారు. బయ్యారం గనుల విషయంలో కేబినెట్ మంత్రులకే స్పష్టత లేదని సోమిరెడ్డి అపహాస్యం చేశారు.

బయ్యారం గనులలో నాణ్యత, పరిమాణం సరిపడినంతగా లేదని కొంత మంది మంత్రులు ఆరోపిస్తే, మరి కొందరు అన్నింటికీ సరైనదే అని అంటున్నారని ఆయన గుర్తు చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కోరిన మొదటి పార్టీ అని ఆయన గుర్తు చేశారు. వైఎస్ ఉన్నప్పుడే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగిందని ఆయన వెల్లడించారు. రోశయ్య హయాంలో ఈ ఒప్పందం కుదిరిందనడం సిగ్గుచేటు అని ఆయన నిప్పులు చెరిగారు. 'అనిల్‌కు వైఎస్ హయాంలోనే భూములు కేటాయిస్తే దీనిపై ఎందుకు మాట్లాడలేరు' అని ఆయన నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles