Agitation against tv dubbed serials

tv serials, tv dubbed serials, maa tv, tv artists, tv artists association, idefinite fast

agitation against tv dubbed serials

అనువాద ధారావాహికలకు నిరసన

Posted: 04/16/2013 09:52 AM IST
Agitation against tv dubbed serials

అనువాద ధారావాహికలకు నిరసనగా టివి కళాకారులు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతు తెల్పుతూ టివి పరిరక్షణ సమితి కూడా ఆందోళనకు సిద్ధమైంది.  ఈ రోజు నుంచి హైద్రాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నట్లుగా పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేసారు. 

టివి ప్రసారాలలో అనువాద ధారావాహికలు టివి ఛానెల్స్ కి చాలా అనుకూలంగా ఉంది కానీ, టివి కార్యక్రమాల కోసమే ఉన్న కళాకారులకు పని లేకుండా పోతోందన్న వ్యధతో చాలా కాలంగా టివి కళాకారులంతా ఆందోళనకు దిగారు.  మా టివి కార్యాలయం మీద దాడి చెయ్యటం కూడా చేసారు.  

ఈ నిరసనలకు సినీ ప్రముఖులు చాలా మంది మద్దతు ను తెలియజేసారు.  కళాకారుల సంఘమైన మా తరఫునుంచి మాగంటి మురళీ మోహన్ కూడా టివి కళాకారులకు మద్దతును ప్రకటించారు.  ఇప్పుడు టివి కళాకారుల పరిరక్షణ సమితి కూడా గళం కలపటంతో నిరసనలు ఇంకా వెల్లువెత్తతాయని తప్పక ఫలితం ఉంటుందని కళాకారులంతా భావిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles