Bomb explosion in boston

bomb explosion in boston, unites states of america, us president, obama, 3 dead in bomb blast, high alert in us

bomb explosion in boston

అమెరికాలో బోస్టన్ నగరంలో జంట పేలుళ్ళు

Posted: 04/16/2013 09:04 AM IST
Bomb explosion in boston

అమెరికాలో బోస్టన్ నగరంలో జంట పేలుళ్ళతో అమెరికా మరోసారి గడగడలాడింది. 

బోస్టన్ లో సోమవారం మారథాన్ నిర్వహించిన ప్రాంతంలో ఆ కార్యక్రమం ముగింపుకి వస్తున్న సమయంలో బాంబు పేలింది.  వెంటనే సహాకచర్యలు చేపట్టిన అధికారులు గాయపడినవారిని బోస్టన్ జనరల్ హాస్పిటల్ కి చేర్చారు.  ఆ తర్వాత పోలీసులు, బాంబు స్క్వాడ్ చేపట్టిన తనిఖీలలో మరో రెండు బాంబులు లభ్యమయ్యాయి.  వాటిని డిఫ్యూజ్ చేసారు.  సెకండ్ల తేడాలో మరో బాంబు లైబ్రరీ సమీపంలో పేలింది.  భారత కాలమానం ప్రకారం ఈ బాంబు పేలుళ్ళు నిన్న రాత్రి ఒంటిగంటకు జరిగింది. 

ఇంతవరకు అందిన సమాచారాన్నిబట్టి ఈ సంఘటనలో మృతుల సంఖ్య 3, అందులో 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు.  గాయపడినవారి సంఖ్య 141 అందులో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ఘటనను తీవ్రస్థాయిలో ఖండించిన అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, సహాయకచర్యలను, గాయపడినవారికి చికిత్సలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.  ఈ బాంబు పేలుళ్ళతో అమెరికాలో జనజీవనం అస్తవ్యస్తమవటమే కాకుండా దాని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద కూడా పడింది. 

అమెరికాలో నిర్వహించిన 26 మైళ్ళ మారథాన్ లో అమెరికా సంయుక్త రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలనుంచి పోటీదారులు పాల్గొన్నారు.  ఎనిమిది లక్షల డాలర్ల బహుమతితో పోటీ నిర్వహించిన ఈ మారథాన్ లో 5 లక్షల మంది వీక్షించటానికి వచ్చారు. 

ఈ బాంబు పేలుళ్ళకి కారణం నల్ల బ్యాగ్ పట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి అని పోలీసులు అనుమానిస్తున్నారు.  హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, నగరంలో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లు, విమానాశ్రయాలలోనూ, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles