Sulphuric acid rain in vizag

acid rain in vizag district, visakhapatnam, sulphuric acid, bhimili mandal, yellow in colour

sulphuric acid rain in vizag

విశాఖ లో కురిచిన యాసిడ్ వర్షం ?

Posted: 04/08/2013 11:15 AM IST
Sulphuric acid rain in vizag

సాదారణంగా వర్షం ఎన్ని రకాలుగా కురుస్తుంది.  చిన్న జల్లులు తో కూడి వర్షం,  బాగా ఉరుములతో కూడి వర్షం,  వడగళ్ల వర్షం  కురుస్తుంది. లేదా  మంచు వర్షం కురుస్తుంది.  ఎప్పుడైన యాసిడ్ వర్షం కురిస్తే   ఎలా ఉంటుంది?  అప్పుడు  భూమి పరిస్థితి ఏమిటి ఆలోచించండి?   ఇప్పుడు అదే జరిగింది. విశాఖ జిల్లా భీమిలీ మండలం చిప్పాడలో ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీళ్లు పసుపురంగులో పడ్డాయి. వర్షం పడినప్పుడు పొంగుతూ తెల్లగా సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో నీరు పోసిన విధంగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అదే నిజంగా యాసిడ్  వర్షం కురిస్తే మన పరిస్థితి ఏమిటి?  అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటానికి కారణం  మనమే?  మనం  ప్రక్రుతిని పాడు చేస్తున్నాం.  మనం చేసే కాలుష్య వాతవరణమే ఇందుకు కారణమని మేథావులు చెబుతున్నారు. ప్రక్రుతిలో రోజుకి రోజుకి  ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అవి మానవ జాతి వినాశనాకి సంకేతాకాలని వాతవరణ పరిశోధకులు అంటున్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. నడినెత్తిన సూర్యభగవానుడు దూకుడు పెంచి.. తన ప్రతాపం భూమిపై చూపిస్తున్నారు. ప్రపంచ దేశాలు  ప్రక్రుతిని కాపాడే ఆలోచన చెయ్యండి? అది ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. లేకపోత చరిత్రలో పేజీల మీద చదువుకోవాల్సి వస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles