Ysrcp mla chandrasekhar reddy comment on power hike

ysrcp, ysrcp mla chandrasekhar reddy, dwarampudi chandrasekhar reddy, power hike, ys vijayamma, political parties, ys vijayamma power deeksha, cm kiran kumar reddy, congress party, government,

ysrcp mla chandrasekhar reddy comment on power hike

తెలుసుకోండి? ఆమె వల్లే విద్యుత్ ఛార్జీలు తగ్గాయి?

Posted: 04/08/2013 11:21 AM IST
Ysrcp mla chandrasekhar reddy comment on power hike

ఇప్పుడు ఏ రంగంలో చూసిన  భజన చేసే బాబులే ఎక్కువుగా కనిపిస్తారు.  పని చేసేది తక్కువ  భజన చేయటం ఎక్కువు?  ‘‘ కూటి కోసం కోటి విద్యలు’’ అని మన పెద్దలు అన్నారు.  ఇప్పుడు  ఆ మాటలను ‘‘నోట్లు కోసం కోటి భజనలు’’ అనే విధంగా మారిపోయారు మన ప్రజా నాయకులు.  ఫోస్టర్  కనబడితే చాలు .. మెప్పుకోసం మైకులు పట్టుకొని  మీడియా ముందు  పొగడ్తల వర్షం కురిపిస్తారు.  మన ఏం మాట్లాడుతున్నాం , దానివలన వచ్చే  లాభ, నష్టాలు గురించి ఆలోంచించే స్థితిలో  నాయకులు లేరు. ప్రజల్లో పబ్లిసిటి, అధిష్టానం దగ్గర మెప్పు, రెండు ఒకేసారి రావాలంటే .. మైకు పట్టుకొని  నోటి దూల తీర్చుకుంటే సరిపోతుందని రుజువు చేస్తున్నారు మన రాజకీయ నాయకులు. రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకున్న విషయం తెలిసింది. అయితే  రాజకీయ పార్టీలు మాత్రం .. ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలతో హోలీ జరుపుకుంటున్నారు. కానీ సమస్యల గురించి  పట్టించుకునే నాయకులే  కనిపించారు.  రాష్ట్రంలో  కరెంట్ సమస్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే.  ప్రభుత్వం పెంచిన ఛార్జీలు తగ్గించాలని, అన్ని రాజకీయ పార్టీలు  దీక్షలు, ధర్నాలు  ప్రజల చేత శభాష్ అనిపించుకున్నాయి.   కిరణ్  సర్కార్  ఒక మెట్టు దిగి  విద్యుత్  భారం నుండి  కొంత ఉపశమనం కలిగించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు  మేము చేసిన దీక్షల వల్లే  విద్యుత్ భారం తగ్గిందని  చెప్పుకుంటున్నాయి.  అలాంటి పార్టీల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి . ఆ పార్టీ నాయకులు  మాత్రం  వైఎస్ విజయమ్మ చేసిన దీక్ష వల్లే  విద్యుత్ చార్జీలు తగ్గినట్లు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష వల్లే ప్రభుత్వం దిగివచ్చి రూ.800 కోట్ల విద్యుత్ భారం తగ్గించిందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన కరెంట్ సత్యాగ్రహం దీక్ష ముగించుకుని కాకినాడ చేరుకున్నారు. ద్వారంపూడికి కార్యకర్తలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles