Water scarcity in anantapur district highest

anantapur district, rayadurgam, kalyana durgam, talupula, water scarcity in anantapur,

water scarcity in anantapur district highest

water-scarcity.png

Posted: 03/29/2013 03:23 PM IST
Water scarcity in anantapur district highest

water-scarce4

అనంతపూర్ జిల్లాలో 60 శాతం ప్రాంతాల్లో విపరీతమైన నీటి ఎద్దడి తో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇంకా పూర్తిగా వేసవి రానేలేదు ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఇకముందు ఎలా ఉండగలమంటూ త్రాగు నీరు కరువై విలవిల్లాడుతున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  ఇంత కరువు మేము ఎప్పుడూ ఎరుగమంటున్నారు అనంతపూర్ జిల్లా వాసులు.

 water-scarce2

ఇప్పటికే చాలా చోట్ల బోర్ వెల్స్ లో నీరు ఇంకిపోయింది. దానితో త్రాగు నీటి కోసం ప్రభుత్వాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సరిపోకుండా ఉన్నాయి. జిల్లా అధికారులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో బోర్ వెల్స్ ని తవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు కోరారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానమూ వారికి లభించలేదు. ఏమైనా సాయం లభించినా అది ఎటూ కాకుండా ఉంది.

 

water-scarce-3

అనంతపూర్ జిల్లా అంతా త్రాగు నీటి ఎద్దడితో అష్టకష్టాలు పడుతోంది. కొన్ని మండలాల్లోనయితే అది ఇంకా తీవ్రస్థాయిలో ఉంది. అందులో రాయదుర్గం, కళ్యాణ దుర్గం, ఓబులదేవుల చెరువు, నల్లమడ, ఎన్.పి.కుంట, ముదిగుబ్బ, తలుపుల మండలాలున్నాయి.

water-scarce

భూగర్భంలోని నీరు పూర్తిగా ఇంకిపోయి ఉండటం వలన ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని రవాణా చెయ్యటమే మార్గమని అనంతపూర్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. భూమిలోంచి నీరు తీయాలంటే చాలా లోతుకి తవ్వవలసి ఉంటుంది. దానికయ్యే ఖర్చు బదులు నీటిని సమృద్ధిగా ఉన్న చోటినుండి రవాణా చెయ్యటం తేలికలో అయిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Si venkatesh wounded in gun fire
Good friday special prayers held all over the state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles