Shops on mysore road demolished

mysore, bangalore, bruhat, bangalore nagarapalika

shops on mysore road demolished

shops-demolished.png

Posted: 03/09/2013 04:05 PM IST
Shops on mysore road demolished

బెంగళూరు మైసూర్ రోడ్డులో మసీదు దుకాణాల కూల్చివేత

బెంగళూరులో ఈ రోజు ఉదయం ప్రాతఃకాలంలోనే మొదలుపెట్టి మైసూర్ రోడ్డులోని మసీదు స్థలంలో అద్దెకుంటున్న 23 దుకాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక సిబ్బంది నేలమట్టం చేసారు.  చెప్పాపెట్టకుండా వచ్చిన జడివానలాగా 250 పైనే పోలీస్ బందోబస్త్ తో వచ్చి చేసిన నగరపాలికవారి ఈ చర్యకు దుకాణదారులు నిర్ఘాంతపోయారు.  అసలే సన్నగా ఉన్న మైసూర్ రోడ్డు మీద ఈ దుకాణదారులు ఇంకా ముందుకు చొచ్చుకుని వచ్చారని నగరపాలికవారు ఆరోపించారు.  పది నుంచి 20 అడుగుల వరకూ కూలగొట్టిన దుకాణాలు నడుపుకుంటున్నవారు మసీదుకి డబ్బు కడుతూ వస్తున్నారు.

 మాకు కాస్త సమయం ఇచ్చినా బాగుండేది.   ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే గబగబా వచ్చి దుకాణాలను కూల్చేస్తున్నారు.  ఇప్పుడు మేమెక్కడికి పోవాలి.  దుకాణంలోని సామాన్లను కూడా సర్దుకునే అవకాశం ఇవ్వలేదని దుకాణదారులు ఆవేదన చెందుతున్నారు.  అందులో 25 సంవత్సరాల నుంచి నడుపుతున్న దుకాణాలు కూడా ఉన్నాయి.  మసీదువాళ్ళు అధికారులతో కుమ్మక్కై ఈ పని చేయించారంటూ ఆరోపిస్తున్నారు.

 మసీదు యాజమాన్యం అనుమతి తీసుకున్నారా అని నగరపాలిక సిబ్బందిని అడిగితే, వాళ్ళు అంగీకరించారని, మసీదు ఆవరణలో కూడా కొంత భాగం పోతోందని చెప్పారు.  అలా వేకువనే రావటానికి కారణం కూడా చెప్పారు.  ఉదయం నాలుగు గంటలకు రావటానికి కారణమేమిటంటే, అసలే రద్దీగా ఉండే ఈ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చెయ్యటం ఇష్టం లేక అని అన్నారు.  రోడ్డు విస్తారం చేసే పని కోసం జాగా తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ దుకాణాలు కట్టిపెడతాం అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb blast in peshawar masjid killed 6
Pak pm received by khurshid at jaypur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles