Political padayatras criticized by one on other

telugu desam party, ysr congress party, sharmila, ysr

political padayatras criticized by one on other

sharmila-yatra.png

Posted: 03/08/2013 09:43 AM IST
Political padayatras criticized by one on other

narsireddy-nannuriరాజకీయాలలో ఎవరి గురించి వారు చెప్పుకోవటం సహజమే.   వారి గొప్పతనాలు, ఆశయాలు, చేసినవి, చెయ్యబోయేవి చెప్పటం వరకూ బాగానే వుంటుంది.  ఏమీ చెప్పకపోతే ఎవరికేం తెలుస్తుంది మరి.  తద్వారా మేము ఇంతటి ఘనులం, ఇంత మంచి వాళ్లం, ఇంతలేసి పనులు చెయ్యగలిగినవాళ్ళం కాబట్టి ఇకముందు కూడా చేస్తామని నమ్మకం పెట్టుకుని అధికారాలను మాకే కట్టబెడితే అందులోనే మీ సక్షేమం, సౌభాగ్యాలు దాగి ఉన్నాయి సుమా అని ప్రజలకు చెప్పటాన్ని ఎవరూ తప్పు పట్టరు.  కానీ తన గీతను పొడిగించ కుండా పెద్దగా చెయ్యటానికి ఉన్న మరో చిట్కా పక్క గీతను చిన్నది చెయ్యటం.  అప్పడు న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం అమలవుతుంది.  పోలికలో తనదే పెద్ద గీత అవుతుంది.  ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నేటి రాజకీయ ప్రచారంలో ఎప్పుడూ అవతలివారిని కించ పరచటమే ధ్యేయంగా మారింది.  

నవ్వడం ఒక యోగమని వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్తుండేవారు.  కానీ ఆయన కుటుంబమంతా ఏడవటంలోనే యోగముందని నమ్ముతున్నట్టున్నారని తెలుగు దేశం కార్యదర్శి నన్నూరి నర్సరెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానంచేసారు.  ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే వైయస్ ఆర్ నవ్వు వెనక విషం ఉండేది.  ఇప్పుడు ఆయన కుటుంబం ఏడుపు వెనక విషం ఉంది అని కూడా ఆయన విమర్శించారు.  ఎందుకలా విమర్శించారూ అంటే,

చంద్రబాబు ది పాదయాత్ర కాదు పాడుయాత్ర అని వైయస్ జగన్ జైల్లోకి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న వైయస్ ఆర్ కూతురు షర్మిల అనటం జరిగింది.  మరి వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళూ ప్రాస కలిసేట్టుగా సమాధానమిచ్చారు.  ఓదార్పు పేరుతో మీ అన్న పాడె యాత్ర చేస్తే, చనిపోయిన భర్తను గుర్తు తెచ్చుకుంటూ మీ అమ్మ ఏడుపు యాత్ర చేస్తే, మీరు క్యాట్ వాక్ లు మీ భర్త అనిల్ స్టేజ్ వాక్ లు చేస్తున్నారు అంటూ నర్సరెడ్డి ఘాటుగా ప్రతివ్యాఖ్యలను చేసారు.  షర్మల చేసే పాదయాత్రలో ఆమె చూపులన్నీ ఖాళీ స్థలాల మీదున్నాయని, వాటి బాపతు భోగట్టా అంతా ఆమె జైల్లో జగన్ ని చూడటానికి పోయినప్పుడల్లా అతని చెవిలో వేస్తుంటుందని, రైతులు ఆమెను తమ పొలాలకు తీసుకెళ్ళటానికి భయపడుతున్నారని, ఆమె కళ్ళు పడ్డాక అవి దక్కుతాయో లేదో అనే భయం వాళ్ళని పీడించటమే అందుకు కారణమని కూడా నర్సిరెడ్డి ధ్వజమెత్తారు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunrays touch surya bhagawan in arasavalli temple
Sri lakshmi ias is permitted to be prosecuted by center  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles