Sri lakshmi ias is permitted to be prosecuted by center

obulapuram mining, sri lakshmi, gali janardan reddy, ias officers

sri lakshmi ias is permitted to be prosecuted by center

srilakshmi.png

Posted: 03/08/2013 09:39 AM IST
Sri lakshmi ias is permitted to be prosecuted by center

sri-lakshmi-photoఓబుళాపురం మైనింగ్ లో అధికార దుర్వినియోగం, అవినీతి, విశ్వాసఘాతం వంటి ఆరోపణలను ఎదుర్కుంటూ సిబిఐ దర్యాప్తులో ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మీద అవినీతి చట్టం కింద విచారణకోసం అనుమతి కావాలంటూ కేంద్రప్రభుత్వాన్ని కోరిన సిబిఐ కి నిన్న అనుమతి లభించింది.  అధికార దుర్వినియోగం కేసను సిబిఐ నమోదు చెయ్యగా దాన్ని కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుంది.  ఇప్పుడు అవినీతి నిరోధక చట్టం కింది కూడా కేసను నమోదు చెయ్యటానికి సిబిఐకి కేంద్రం నుంచి అనుమతి లభించటంతో సిబిఐ ఆ పనిని కూడా చేసింది.

  ఐఏఎస్ అధికారులు అఖిలభారత సేవల కిందికి వస్తారు కనుక వారి మీద విచారణలను చేపట్టటానికి ముందుగా కేంద్ర ప్రభుత్వ నుంచి అనుమతి అవసరం కనుక సిబిఐ కి ఇంత కాలం ఆగవలసి వచ్చింది.  ఇప్పుడు అవినీతి చట్టం కింది శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చెయ్యటానికి కావలసిన అనుమతులు రాష్ట్రపతి భవన్ నుంచి లభించటం వలన ఆమె మీద అవినీతి చట్టం కింద నమోదైన కేసులను కూడా విచారణకు పరిగణించాలంటూ సిబిఐ మెమో దాఖలు చేసింది.  

అయితే, దర్యప్తు పూర్తయింది కాబట్టి అనారోగ్య కారణంగా బెయిల్ మంజూరు చెయ్యమంటూ కోర్టుని ఆశ్రయించిన శ్రీలక్ష్మికి అప్పట్లో బెయిల్ లభించింది.  కానీ ఈ నెల 20 తేదీకల్లా అది పూర్తయిపోతుంది కాబట్టి, కాలిలోనూ, వెన్నులోని నొప్పులతో తీవ్ర అస్వస్థతతో ఉన్న తనకు ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ బెయిల్ కావాలంటూ శ్రీలక్ష్మి తాజాగా మరో పిటిషన్ ని దాఖలు చేసారు.  దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆమె మీద అవినీతి చట్టం కింద కేసు నమోదు చెయ్యటానికి కేంద్రం నుంచి అనుమతి రావటం ఆమెకు ఊహించని పరిణామమే.  దాని ప్రభావం బెయిల్ పిటిషన్ మీద పడవచ్చని భయపడుతున్నారావిడ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political padayatras criticized by one on other
Property tax sparks off divorces in china  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles