ప్రక్షాళన చేస్తానన్న రాహుల్ కాంగ్రెస్ పగ్గాలను నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎన్నికల్లో విజయానికి దోహదం చేసే ఏ విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ విస్మరించే పరిస్థితిలో లేదు. మొన్నామధ్య కాంగ్రెస్ పార్టీనీ పరిశుభ్రం చేస్తానని ప్రకటించారు, నిన్న తనకు ప్రధాన మంత్రి పదవి మీద కాంక్ష లేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న రాహుల్ గాంధీ నిన్న సాయంత్రం పార్టీ కార్యవర్గ సభ్యులతో, పార్టీలోని లోపాలను సవరిస్తూ, సమాచార సహకార విధానాల్లో ఉన్న అంతరాలను పూరిస్తానంటున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆకర్షణ ఏమీ కనపడటం లేదు కాబట్టి రాహుల్ గాంధీ పార్టీ పనుల్లో పుంజుకుని ప్రజల మనిషిగా పైకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా,
క్రమపద్ధతిలో రాహుల్ గాంధీ అమ్మ స్థానాన్ని ఆక్రమించి ఆమెకు విశ్రాంతిని కలుగజేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ప్రతి రోజూ వేరు వేరు పార్లమెంటు సభ్యులను కలిసి చర్చల్లో పాల్గొంటున్నారు. అజెండా ఒక్కటే పార్టీలో సంపూర్ణ సహకారాలతో మెలుగుతూ పటిష్టం చేసుకుంటూ భాజపా ని ఎలా అణచాలి అన్నది ముఖ్యాంశం. భాజపా గుప్పిట్లో ఉన్న మధ్యప్రదేశ్ లో కేంద్ర సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ వాటి ద్వారా ప్రజలలో కాంగ్లెస్ పార్టీకి పేరు తీసుకునిరావాలి. ఇప్పటి వరకూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేస్తున్న ఈ పనులను ఇక ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నిర్వహించబోతున్నారు.
పార్లమెంటు సభ్యులను బలోపేతం చెయ్యాలన్నది రాహుల్ తన లక్ష్యమని అంటున్నారు. పార్లమెంటు సభ్యులు పేరుకే కానీ వాళ్ళెవరికీ అధికారాలు లేవని, అది ఏమీ బాగోలేదని రాహుల్ అంటున్నారు. పార్లమెంటులోని 720 సభ్యులనూ బలోపేతం చేస్తానని, మిగిలిన పార్టీల్లో (బిఎస్ పి, ఎస్పి, భాజపా) లలో ఒకరిద్దరికంటే ఎక్కువ నాయకులుండటం లేదు. దానితో మిగిలిన సభ్యుల గళాలు పైకి పెగలటం లేదు. అలా కాకుండా పార్లమెంటు సభ్యులందరూ వారి వారి అధికారాలను వినియోగించుకునే విధంగా విధానాత్మక చర్యలను చేపడతానన్నారు రాహుల్. ఇదే పద్ధతిలో రాష్ట్రాల్లో కూడా శాసన సభ సభ్యులకు అధికారాలుండేట్టుగా కూడా కృషి చేస్తానంటున్నారాయన.
ఇదంతా విని, పార్లమెంటు సభ్యుల గొంతులు పెగలటం లేదని బాధను వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీకీ ప్రధాన మంత్రికీ ఇతర మంత్రులకు కూడా ఎలాంటి అదికారాలను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టలేదుగా దాని మాటేమిటి అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తోలుబొమ్మగా ప్రధానమంత్రికి ముద్రపడిపోయింది. పార్టీ అధ్యక్షురాలి కనుసన్నలలోనే మంత్రులంతా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ సత్యం. అలాంటప్పుడు పార్లమెంటు సభ్యులకు అధికారాలు లేవు, ఒకరిద్దరి నాయకుల చేతుల్లోనే పార్టీలు నడుస్తున్నాయని రాహుల్ అనటం మిగిలిన పార్టీలకు విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందంటున్నారు పార్టీలోని కొందరు సభ్యులు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more