New longer lasting drug to fight diabetes

treatment, sugar levels, medicine, injection, effective, drug, diabetes, new hope in fight against diabetes

New longer-lasting drug to fight diabetes

diabetes.gif

Posted: 03/05/2013 05:34 PM IST
New longer lasting drug to fight diabetes

New longer-lasting drug to fight diabetes

మధుమేహబాధితులకు శుభవార్త! ఇకపై మీరు రోజుకు రెండుసార్లు, మూడుసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుని బాధపడాల్సిన పనిలేదు. ఒకసారి ఇంజెక్ట్ చేసుకుంటే 40 గంటలపాటు ప్రభావం చూపే సరికొత్త దివ్యౌషధాన్ని ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ నోవో నార్డిస్క్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆ సరికొత్త ఔషధం పేరు ట్రెసిబా. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో లభ్యమవుతోంది. పనుల ఒత్తిడిలో, హడావుడిలో ఉండేవారికి ఈ ఇంజెక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఇంజెక్షన్ టైప్ 1, టైప్ 2 మధుమేహులిద్దరికీ ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు వివరించారు."రోజూ రెండుమూడుసార్ల చొప్పున ఒకే సమయానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, అది బాధాకరమని నా పేషెంట్లలో చాలా మంది చెప్పారు. వారు చెప్పే కారణాలు కూడా సహేతుకమైనవే. సరిగ్గా ఆ సమయానికి మనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవచ్చు. ఆఫీసు పనిలో అత్యవసరంగా ఉండాల్సిరావచ్చు'' అని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన డయాబెటిస్ మెడిసిన్ ప్రొఫెసర్ మెలనీ డేవీస్ చెప్పారు. "ఇన్సులిన్ ఆధారిత మధుమేహ బాధితులు ఇకపై తమ రక్తంలో చక్కెరస్థాయుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు'' అని ఆయన అన్నారు. ఈ ట్రెసిబా ఔషధానికి జనవరిలో యూరోపియన్ కమిషన్ ఆమోదం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab visits his in laws house in narail
E ink smartphone lasts longer with weeks long battery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles