Taliban suicide bomber attacked

talibans, suicide bomber attacks, kabul, afganstan

10 hurt in taliban suicide bomber attacked

suicide-attack.png

Posted: 02/27/2013 06:02 PM IST
Taliban suicide bomber attacked

suicide-bomber

తాలీబాన్ ఆత్మాహుతి దళ సభ్యుడొకడు ఈ రోజు ఆఫ్గనిస్థాన్ కాబూల్ లో సేనా దళానికి చెందిన బస్సుని పేల్చగా 10 మందికి గాయాలయ్యాయి.  అందులో ఆరుగురు సైనికులు, నలుగురు పౌరులు ఉన్నారు. 

ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సైనికులు, పోలీసులు, కార్యాలయ సిబ్బందిని తరలించటానికి ఉపయోగించే బస్సుని సిద్ధం చేస్తుండగా, తాలిబాన్ సభ్యుడు ఆ బస్సుకిందికి దూరి, తనకు కట్టుకున్న బాంబుని పేల్చివేసాడు.  వెంటనే బస్సుకి మంటలంటుకున్నాయి.  ఇలా ఎప్పుడూ బస్సులను ఉపయోగిస్తూ అవి ప్రతిరోజూ ఒకే మార్గంలో పయనించటం ఉగ్రవాదుల చర్యలకు సహాయకారిగా ఉంటుందని అక్కడివారు అంటున్నారు. 

అప్పుడే అందరూ బస్సు ఎక్కుతున్నారు.  ఇంతలో ఒక మనిషి బస్సుకిందికి దూరుతుంటే బస్సు డ్రైవరుకి సంబంధించిన మనిషేమో, బస్సుకి చెయ్యవలసిందేమైనా చేయటానికి కిందికి దూరుతున్నాడనుకున్నానని అక్కడ దూరం నుంచి జరిగిందంతా చూసిన ప్రత్యక్ష సాక్షి అహ్మద్ షకీబ్ అన్నాడు.  కానీ అతను కిందికి వెళ్తూనే తన నడుముకి కట్టుకున్న బాంబుని పేల్చివేసాడు.  ఆ పక్కనే బేకరీ దగ్గర ఉన్న ఆరుగురు ఆ విస్ఫోటంలో గాయపడ్డారు.

ఇది జరగటానికి మూడు రోజుల ముందు ఒకతను కారులో పేలుడు పదార్థాలను పెట్టుకుని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లక్ష్యంగా పేల్చటానికి పోతుండగా పోలీసులు కనిపెట్టి అతన్ని కాల్చి చంపారు. 

ఆ ఘటనకు బాధ్యులం మేమేనంటూ తాలిబాన్లు అసోసియేటెడ్ ప్రెస్ కి టెక్స్ట్ మెసేజ్ పంపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp calls rail budget 2013 rae bareli budget
Hyderabad bomb blast suspect found in jammu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles