Dccb election officer traced in madanapalli

dccb elections, madanapalli, kadapa, ministers, political leaders

dccb election officer traced in madanapalli

dccb-election-officer.png

Posted: 02/20/2013 04:27 PM IST
Dccb election officer traced in madanapalli

కడపలో అదృశ్యమైన డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల అధికారి చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రత్యక్షమైనారు.  ఎన్నికలకు సమయం మించుతుండటంతో అక్కడ కడపలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, చంద్రశేఖర్ ఆచూకీ పోలీసులకు చిత్తూరులో దొరికిందని సమాచారం అందింది.  

చంద్రశేఖర్ కథనం ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కడపలో చంద్రశేఖర్ తో శాసన సభ్యులు, మంత్రులు పిలుస్తున్నారని చెప్పి అతన్ని బలవంతంగా తీసుకెళ్ళి, మదనపల్లిలో వదిలిపెట్టారు.   పోలీసులను ఆశ్రయించి వారి సాయంతో చంద్రశేఖర్ కడపకు చేరుకున్నారు.  తను ఆ సంగతంతా కడప కలెక్టర్ శశిధర్ కి వివరంగా తెలియజేసానని, ఆయన సూచన మేరకు కడప 1 వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసానని, చంద్రశేఖర్ అన్నారు.

 
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles