I will not resign over choppergate ak antony

defence minister ak antony, ak antony,choppergate, resignation, parliament

i will not resign over choppergate: ak antony

ak-antony.gif

Posted: 02/19/2013 09:12 PM IST
I will not resign over choppergate ak antony

i will not resign over choppergate: ak antony

ఆగస్టా హెలికాఫ్లర్ల కుంభకోణం వ్యవహారంలో తాను రాజీనామా చేసేది లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏ.కె. ఆంటోనీ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం విదేశాంగశాఖ సమన్వయంతోనే హెలికాఫ్టర్లు కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఆగస్టా స్కాం వ్యవహారంలో విచారణకు తమకు సహకరించాలని ఇటలీ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం వ్యవహారంపై స్పందించిన రక్షణశాఖ మంత్రి ఆంటోనీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తాను దాచిపెట్టేది ఏమిలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు కూడా లేవని తెలిపారు. దర్యాప్తు అనంతరం వివరాలను బయట పెడతామని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఇటలీ అధికారుల నుంచి అధికారిక సమాచారం అందాకే చర్యలు తీసుకుంటామని, నిందితులు ఎంతటివారైనా వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్ల కుంభకోణం ఆరోపణలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటోని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran meet on power minister scindia
Nagaland home minister resigns  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles