Mim mla akbaruddin owaisi over hate speech

MIM MLA Akbaruddin Owaisi, hate speech,

Court hears plea against MIM MLA Akbaruddin Owaisi over 'hate speech' - A local court has reserved its orders till tomorrow on a petition filed by a city-based lawyer seeking actio

MIM MLA Akbaruddin Owaisi over hate speech.png

Posted: 01/03/2013 09:59 AM IST
Mim mla akbaruddin owaisi over hate speech

kishan-reddyమజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటరీ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ చేిసన వ్యాఖ్యలు లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడిలా ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త షబ్మమ్ హష్మీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి 153ఎ సెక్షన్ కింద పోలీసులు అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ 24వ తేదీన చేసిన హేట్ స్పీచ్‌పై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై తాను వేసిన పిటిషన్ల వంటివి మరిన్ని కోర్టుల్లో దాఖలు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తి ప్రజలను కోరిన విషయం తెలిసిందే.

అక్బరుద్దీన్‌పై పిటిషన్ వేసిన కె కరణ్‌సాగర్‌కు మూడు సార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయంపై దర్యాప్తు చేసి జనవరి 17వ తేదీలోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు.హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. హిందూ దేవుళ్లను కించపర్చేలా మాట్లాడిన మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa meets mopidevi
Nannapaneni rajakumari attacks subhash patriji  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles