Balakrishna confirms contesting for mla seat

Balakrishna Confirms Contesting for MLA Seat, balakrishna statement, chandrababu naidu, contest as mla, tdp leaders, tdp sources, suprise, Balakrishna, chandra babu naidu, bava, chandra babu

Balakrishna Confirms Contesting for MLA Seat

Balakrishna.gif

Posted: 11/23/2012 01:25 PM IST
Balakrishna confirms contesting for mla seat

Balakrishna Confirms Contesting for MLA Seat

అదిగో, మా బావమరిది రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఇక మన పార్టీ బాగుపడుతుంది.  నేను మా బావ కోసం ఏమైన చేస్తాను.  బావ ఎప్పుడు పిలిస్తే అప్పుడు  రాజకీయాల్లోకి వస్తాను.  ఆ... అదీ .. అదీ.. మరీ .. మా బావ చెబితే సరే?  బావ ఎక్కడ సీటిస్తే అక్కడి నుండే పోటీ చేస్తాను అనే డైలాగులు మీడియాలో అనేక సార్లు విన్నాం. ఎవరు ఎవరో కాదు ఒకరు చంద్రబాబు, మరొకరు హరిక్రిష్ణ కాదు? బాలయ్య. నిన్నటి వరకు బాలయ్య లోక్ సభకు పోటీ చేస్తారని అందరు అనుకున్నారు. పార్టీ వర్గాలు కూడా అలాగే చెబుతున్నాయి. అయితే ఈరోజు  బాలయ్య వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తానని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. అయితే తాను ఏ స్థానం నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల ముందు వలసలు సర్వ సాధారణమని, టీడీపీలో నుంచి వెళ్లే వలసల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఇతర పార్టీలకు వెళ్లేవారంతా అవకాశ వాదులేనని బాలకృష్ణ అన్నారు. కాగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యాక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్‑కు చెందిన 'యూవీకెన్' సంస్థతో కలిసి తాము పనిచేస్తామన్నారు. క్యాన్సర్‑తో బాధపడేవారు అధైర్యపడవద్దని ఆయన సూచించారు. ఆత్మస్థైర్యంతో చికిత్స తీసుకుంటే క్యాన్సర్ కూడా నయం అవుతుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shops should display signboards in telugu
Blackmailing youth with photos in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles