Blackmailing youth with photos in vijayawada

journalist Suresh,blackmailing, Vijayawada,suresh,arrest, నగ్నంగా వీడియోలు,ఆడ గొంతుతో మాట్లాడుతూ

blackmailing youth with photos in Vijayawada

blackmailing.gif

Posted: 11/23/2012 01:05 PM IST
Blackmailing youth with photos in vijayawada

blackmailing youth with photos in Vijayawada

ఇతని పేరు సురేష్.. లోకల్ పత్రికలో రిపోర్టర్ నని చెప్పుకుంటున్న ఇతగాడే నీలిచిత్రాల ముఠాకు నాయకుడు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని నీలిచిత్రాల రొంపిలోకి లాగటం ఇతని నైజం. తన స్నేహితురాలి సహయంతో ఇతను యువతీ, యువకులకు వల వేస్తున్నాడు. ఆమె సహయంతో  యువతీ, యువకుల ఫోన్ నంబర్లు సంపాదించటం.. ఫోన్ లో వారిని ఆకట్టుకోవటం. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన బెల్లపు సురేష్ (22) హైదరాబాద్ కు చెందిన ఓ చిన్నపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. ఆడ గొంతుతో మాట్లాడుతూ యువతీ యువకులను ఆకట్టుకోవడంలో దిట్ట. నాలుగు నెల ల క్రితం విజయవాడ సింగ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. యువతీయువకులతో స్నేహం పెంచుకున్న ఆ యువకుడు వారిని సింగ్‌నగర్‌కు రప్పిస్తుంటాడు. అలా వచ్చిన యువతీ, యువకులను నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండేలాచేసి, వారికి తెలియకుండా నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు.

suresh

తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోని గంగానపల్లికి చెందిన కృష్ణపు బాలాజీతో అమ్మాయిలా మాట్లాడి నగరానికి రప్పించాడు. తన ఇంట్లోకి పిలిచి మరో అమ్మాయిని పంపించి వారి అర్ధనగ్న దృశ్యాలను చిత్రీకరించాడు. బాలాజీ వద్ద ఉన్న డబ్బు తీసుకున్నాడు. మూడు రోజులు బంధించాడు. భారీ మొత్తంలో డబ్బు ఇస్తావా లేకుంటే ఈ చిత్రాలను నెట్లో పెట్టమంటావా? అంటూ బెదిరింపులకు దిగాడు. సురేష్ చెరనుంచి తప్పించుకున్న బాలాజీ సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు కథ బయటపడింది. సింగ్‌నగర్ సీఐ నాగేశ్వరరావు రంగంలోకి దిగి పిఅండ్‌టీ కాలనీలోని స్థావరంపై దాడిచేసి పలు నీలి సీడీలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న సురేష్‌తోపాటు, అతనికి సహకరించిన వీరేంద్రను అరెస్టుచేశారు. రాఘవేంద్ర, రాజమండ్రికి చెందిన ఓ వివాహిత పరారీలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna confirms contesting for mla seat
2013 india holidays  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles