Athena cyclone in america

athena winter storm, athena cyclone, us winter storm season, athena first winter storm, north america, winter storm athena, sandy cyclone, athena, sandy, us prisedent obama, us election 2012, storm, 2012 us winter storm season, 2013 us winter season

athena cyclone in america

athena.gif

Posted: 11/09/2012 10:05 AM IST
Athena cyclone in america

athena cyclone in america

శాండీ తుపాను సృష్టించిన విలయం నుంచి ఇంకా కోలుకోని అమెరికా ఈశాన్య తీరంపై ‘అతెనా’ రూపంలో మరో తుపాను విరుచుకుపడింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచ్యుసెట్స్ రాష్ట్రాల్లో గంటకు 50 మైళ్ల వేగంతో భీకర గాలులతో కూడిన భారీ వర్షాలు, హిమపాతాలతో తుపాను ముంచెత్తింది. అనేక చోట్ల 7-13 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయింది. తుపాను కారణంగా చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి కరెంటు తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో లక్షలాది మంది అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యూజెర్సీలో సుమారు 60 వేల మంది, న్యూయార్క్‌లో 80 వేల మంది సహా మొత్తం 1.60 లక్షల మంది పౌరులు అంధకారంలో మగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్‌పోర్టు, న్యూయార్క్‌లోని లాగ్వార్డియా, జె.ఎఫ్. కెన్నడీ ఎయిర్‌పోర్టు సహా ఇతర ఎయిర్‌పోర్టుల్లో 1710 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే న్యూయార్క్‌లోని పెన్ రైల్వేస్టేషన్‌ను కూడా ప్రతికూల వాతావరణం కారణంగా తాత్కాలికంగా మూసేశారు. సబ్‌వే రైలు సర్వీసులు మాత్రం నడుస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ తుపాను తూర్పు తీరం నుంచి ఉత్తర-మధ్య అట్లాంటిక్, ఈశాన్యం వైపు కదులుతోందని జాతీయ వాతావరణ విభాగం పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో తూర్పు తీరంలో గంటకు 60 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో 6 నుంచి 10 అంగుళాల మేర మంచు కురవవచ్చని అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress leaders medomadhanam meeting in delhi
Kcr new plans in trs medomadanam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles