Kcr new plans in trs medomadanam

trs meeting in karimnagar,trs meet at karimnagar,trs,telangana rashtra samithi,trs public meeting,kcr speech,telangana,trs leaders,trs medomadhanam in karimnagar, medomadhanam,conference in karimnagar,trs meet in karimnagar,k chandrasekar rao,ktr.trs mlas,trs mps,harish rao,trs mla harish rao, kcr son ktr, mla ktr, mla rajendar

KCR New Plans In TRS Medomadanam in Karimnagar 2nd Day.

KCR New Plans In TRS Medomadanam.png

Posted: 11/08/2012 09:41 PM IST
Kcr new plans in trs medomadanam

trs_kcrతెలంగాణ రాష్ట్రసమితి పార్టీ మేథోమధన సదస్సు కరీంనగర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు నేటితో ముగిసింది. ఈ ముగింపు సదస్సులో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమాన్ని గత పన్నెండేళ్ళుగా సజీవంగా నిపులుకున్నామని, దానికి మీరందరు ఇచ్చిన సహాయ సహకారాలే కారణమని అన్నారు. ఇక తెలంగాణ అంశం గత కొద్ది రోజులు శాంతించిందని, తమ గమ్యం ముద్దాడే వరకు విశ్రమించేది లేదని, ఎత్తిన జెండా దించం.. బిగించిన పిడికిలిని సడలించం అని చెప్పారు.

ఇక పార్టీ కార్యచరణ గురించి మాట్లాడుతూ.... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధాలు ఉండవని, కాంగ్రెస్, టీడీపీ ఒక చీడపురుగు లాంటి పార్టీలని, బీజేపీతో కలిసి పనిచేసేందుకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అన్నారు.  సకలజనుల సమ్మె నేపథ్యంలో కొంచెం వెసులుబాటు కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కోరారని, ఆయన కోరిక మేరకు కొంచెం శాంతించామని కేసీఆర్ తెలిపారు. కొద్ది నెలలుగా కాంగ్రెస్ అధిష్టానం తమతో చర్చలు జరుపుతోందని, ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నోసార్లు మోసం చేసినా తర్జనా భర్జనల అనంతరం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. చర్చల్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కండిషన్ పెట్టారని, హైదరాబాద్‌తో కూడుకున్న తెలంగాణ ఇస్తే పార్టీనీ విలీనం చేస్తామని ఒప్పుకున్నామని, అయినా కాంగ్రెస్ తాత్సారం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పాటుపడదామని తెలిపారు. 29న 'దీక్షా దివాస్' పేరుతో తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అలాగే నవంబర్ 30 నుంచి 'పల్లెబాట' కార్యక్రమం చేపట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ పల్లెబాట కార్యక్రమం 40 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నల్లజెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Athena cyclone in america
Cbi court extended ys jagan remand till november 22  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles