America new history first sikh speaker

Republican National Convention Enlists First Sikh Speaker,Florida, Haley, Nikki R, Republican National Convention, Romney, Mitt, Sikhs and Sikhism, Singh, Ishwar, United States, Wisconsin

Republican National Convention Enlists First Sikh Speaker

Sikh.gif

Posted: 08/31/2012 01:32 PM IST
America new history first sikh speaker

Republican National Convention Enlists First Sikh Speaker

 ఫ్లోరిడాలోని 'సిక్కు సమాజ' ప్రధాన గురువు ఈశ్వర్‌సింగ్ అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో మొట్టమొదటి సారిగా సిక్కు మత ప్రార్థనలు నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఇరవై రోజుల క్రితం అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగిన అల్లర్లలో ఆరుగురు సిక్కు మతస్థులు ప్రాణాలిడిచిన సంగతి తెలిసిందే. సిక్కులకు తగిలిన గాయాన్ని రిపబ్లికన్ పార్టీ నయం చేయాలనుకుంది.ఈ మేరకు తమ పార్టీ జాతీయ సదస్సులో ప్రార్థనలు నిర్వహించేందుకు అమెరికాలో చరిత్రలోనే ఒక సిక్కు గురువుకు మొదటిసారిగా అవకాశమిచ్చింది. 40 ఏళ్ల క్రితం అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఒక సిక్కు గురువు ఒక వేదికపై అమెరికన్లకు ప్రార్థనలు నిర్వహిస్తాడని ఊహించలేదని, ఈ అవకాశం రావడం తనకే కాక, అమెరికాలోని సిక్కు ప్రజలందరికీ గర్వకారణమని చెప్తూ ఈశ్వర్‌సింగ్ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యారు. ఈశ్వర్‌సింగ్ ప్రార్థనలతో సదస్సు రెండో రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి.

Republican National Convention Enlists First Sikh Speaker

'ఇక్కడ నిలబడి ఒక సిక్కుగా, ఒక అమెరికన్‌గా ప్రార్థనలు చేయడం నాకు చాలా గొప్పగాఉంది.మా దేశంలో స్వేచ్ఛకు, సమానత్వానికి సుస్థిర స్థానముందని చెప్పడానికి గర్విస్తున్నాను' అని ఆయన ఈ సదస్సులో అన్నారు. అల్లర్ల గురించి మాట్లాడుతూ 'ఇటీవల ఓక్‌క్రీక్‌లోని గురుద్వారాలో చెలరేగిన హింస పట్ల మనమంతా చాలా బాధపడుతున్నాం, ఇక నుం చి ఇతరుల పట్ల మన మనసుల్లోని అసహ్య భావాన్ని తుడిచేద్దాం. మనమంతా ఒకే దేశ ప్రజలమని, ఒకే దేవుడి నీడలో ఉన్నామని గుర్తుచేసుకుందాం' అని అన్నారు. సిక్కు ప్రధాన నియమాలైన స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం వంటి వాటికి అమెరికా నీతి సూత్రాల్లో సముచిత స్థానం ఉందని, ఈ సదస్సు వేదికగా సిక్కు మత స్ఫూర్తిని అమెరికన్లతో పంచుకునేందుకు గొప్ప అవకాశం దొరికిందని సదస్సుకు వచ్చే ముందు ఆయన పేర్కొన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man posts himself to girlfriend
101 year old driver hits 11 people in los angeles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles