Kiran attacks jaipal reddy

Kiran attacks Jaipal Reddy,Jaipal Reddy, CM Kiran kumar Reddy, Open fight, Gas allocations, Jagga Reddy, K.Keshava Rao, V. Hanumantha Rao, Delhi, Congress, High command

Kiran attacks Jaipal Reddy

Kiran.gif

Posted: 08/13/2012 11:44 AM IST
Kiran attacks jaipal reddy

Kiran attacks Jaipal Reddy

రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందా.. లేదా అన్న విషయం తాను చెప్పలేనని, అయినా అది ప్రైవేటు ప్రదేశాలలో చర్చించే అంశం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవి వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వైవాహిక స్వర్ణోత్సవానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడేదేమీ లేదంటూనే పలు విషయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉందా లేదా అన్నది చెప్పలేనని.. కేరళ రాష్ట్ర వాసినైన తనకు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వబోరని చమత్కరించారు. గ్యాస్ వ్యవహారంలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి, సీఎం కిరణ్‌కు మధ్య అగాథం ఉందన్న విషయం తనకు తెలియదని.. ఉంటే మాత్రం తానేం చేయగలనని అన్నారు. త్వరలో హైదరాబాద్ వచ్చి.. అప్పుడు పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తానని వయలార్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు అప్పుడు వరుసగా సమావేశాలు పెట్టుకుంటామని చెబుతూ.. అంతమాత్రాన పార్టీ బలహీనంగా ఉందని కాదని, మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. కాగా, వయలార్ ఈనెల 16న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Complaints on obscenity nudity against tv channels
Children as young as 8 are lending money to their parents as they worry about family finances  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles