Children as young as 8 are lending money to their parents as they worry about family finances

Children as young as 8 are lending money to their parents as they worry about family finances,United Kingdom,London,Halifax,Britain

Children as young as 8 are lending money to their parents as they worry about family finances

Children.gif

Posted: 08/13/2012 11:26 AM IST
Children as young as 8 are lending money to their parents as they worry about family finances

Children as young as 8 are lending money to their parents as they worry about family finances

పెరుగుతున్న జీవన వ్యయం... కరుగుతున్న కాసుల రాబడి... కుదేలయ్యే కుటుంబ ఆర్థిక స్థితిగతులు... ఇదీ బ్రిటన్‌లో సగటు జీవుల బతుకు చిత్రం... అయితే, అడపాదడపా పిల్లలకిచ్చే పాకెట్ మనీ వారికిప్పుడు అక్కరకొస్తోంది. అలాగని వాళ్లు కూడబెట్టుకున్న సొమ్మును వీళ్లు వాడేసుకునే వీల్లేదు. ఆ చిన్నారులే పెద్దమనసుతో అమ్మానాన్నలకు అప్పులిస్తున్నారట! తల్లిదండ్రులకే కాదు, అవసరంలో ఉన్న స్నేహితులు లేదా పొరుగింటివారికీ రుణసాయం అందిస్తున్నారట... ఇలాంటి పిల్లల్లో 8-15 ఏళ్ల మధ్య వయస్కులు 58 శాతం కావడం విశేషం. హలిఫాక్స్ సేవింగ్స్ సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విచిత్ర వాస్తవం వెల్లడైంది. మొత్తం 1,132 మందిని ఆ సంస్థ ఇందుకోసం ఎంపిక చేసింది. వీళ్లలో 29 శాతం తిరిగిస్తామన్న వాగ్దానం పొంది మరీ తల్లిదండ్రులకు రుణమిచ్చారు. మూడింట రెండొంతుల మంది స్నేహితులకిచ్చారు. ఎనిమిదేళ్లవారిలో నాలుగో వంతు అప్పులిస్తే అందులో మూడోవంతు పిల్లలు అమ్మానాన్నలకే ఇవ్వడం గమనార్హం. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఏమాత్రం చింత లేదని వీరిలో 57 శాతం చెప్పారు. అయితే, 11 ఏళ్లవారి విషయంలో ఇది 47 శాతంగా నమోదైంది. దీన్నిబట్టి కుటుంబాల్లోనే కాకుండా చుట్టూ ఉన్నవారి డబ్బు ఇబ్బందులపై పిల్లల్లో చక్కటి అవగాహన ఉన్నట్లు తేలుతున్నదని హలిఫాక్స్ సంస్థ అధిపతి రిచర్డ్ ఫీరోన్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran attacks jaipal reddy
Kcr name changed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles