Cheating case on margadarsi md

Cheating Case on Margadarsi MD. Cheating Case, Margadarsi MD, Margadarsi, eenadu group, Ramoji rao

Cheating Case on Margadarsi MD. Cheating Case, Margadarsi MD, Margadarsi, eenadu group, Ramoji rao

Cheating Case on Margadarsi MD.gif

Posted: 07/07/2012 11:29 AM IST
Cheating case on margadarsi md

Margadarsiప్రముఖ చిట్ ఫండ్ అయిన మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ పై, విజయవాడ బ్రాంచి మేనేజరు శ్రీనివాసరావు పై హషిత అనే బాధితురాలు ఫిర్యాదు మేరకు నమ్మక ద్రోహం, మోసం చేయడం వంటి నేరాల కింద కేసు నమోదు అయింది. సదరు మహిళా తీసుకున్న రుణం తిరిగి చెల్లించినా ఆ స్థలం తాలూకు పత్రాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో పిటీషన్ వేసింది. దీని పై మేజిస్ట్రేట్ జయరాజు కేసు నమోదు చేయాలని మాచవరం పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే... 2009 జూన్ 17న కె.సుభాషిణి ఆస్తిని రూ. 57,50,000కు కొనుగోలు చేసింది. ఈ ఆస్తిని తాకట్టుపెట్టి మార్గదర్శి చిట్ ఫండ్ నుండి సుభాషిణి రూ. 29,95,000 రుణంగా పొందింది. ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండుదఫాలుగా రూ. 20 లక్షలు చెల్లించిన హషిత మిగతా రూ. 9,95,000లకు గ్యారెంటీగా విజయా బ్యాంకు పేరు మీద ఓ చెక్కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2009 మార్చి 28న మరో 3లక్షలు చెల్లించారు. మిగిలిన రూ. 6,95,000 మొత్తాన్ని చెల్లిస్తానని, తన స్థలం టైటిల్ డీడ్ డాక్యుమెంట్లు ఇవ్వాలని చిట్‌ఫండ్ నిర్వాహకులను హషిత కోరింది. అయితే చిట్ ఫండ్ వారు మాత్రం ఇంకా 8 లక్షలు ఇస్తేనే డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పడంతో ఈమె సదరు కోర్టులో పిటీషన్ వేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will jagadish shettar be cm
Chandra deo in race for vice president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles