Mla son arrested in drug racket

MLA Satyavathi Rathod's son arrested in drug racket

MLA Satyavathi Rathod's son arrested in drug racket

MLA son arrested in drug racket.gif

Posted: 07/06/2012 05:04 PM IST
Mla son arrested in drug racket

Drugఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల పిల్లలు రేవ్ పార్టీలలో, పబ్ లలో మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. పబ్ లలో అయితే పోలీసులు రైడ్ చేస్తారని తెలుసు కాబట్టి కొత్త మార్గాలను వెతుకుతున్నారు. తాజా గా తెలుగు దేశం పార్టీకి చెందిన డోర్నకల్ శాసనసభ్యురాలు అయిన సత్యవతి రాథోడ్ కొడుకు, కరీంనగర్ మున్సిపల్ ఛైర్మెన్ కొడుకు ఇద్దరు కలిసి ఉప్పల్ లోని మున్సిపల్ గ్రౌండ్ లో గంజాయి సేవిస్తూ, డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు సమాచారం. 

వారిలో ఒకరు సునీల్ కుమార్ కాగా మరొకరు అభిజిత్. పోలీసులు వారిని వెంటనే తమ అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇటీవల పోలీసులు బంజారాహిల్స్ వంటి కాస్ట్‌ లీ ఏరియాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై దాడులు జరిపి అరెస్టు చేస్తున్న నేపథ్యంలో ఎవరూ గుర్తించరని ఉప్పల్ గ్రౌండ్సులో వీరు గంజాయి తీసుకుంటుండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు పట్టుకున్నా వీరు మారరు. వీరిని మార్చాల్సింది రాజకీయ నాయకులు అయిన వారి తల్లిదండ్రులే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi special court allows ed to question jagan
Gold fly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles