Cement factories managment fined huge amount

cement factories managment fined huge amount

cement factories managment fined huge amount

23.gif

Posted: 06/24/2012 05:07 PM IST
Cement factories managment fined huge amount

      సిమెంట్ కంపెనీల పాపాలు పండాయి. దేశంలో కృత్రిమ కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసినందుకు 11సిమెంట్ కంపెనీలకు8e కేంద్రం ఆరు వేల కోట్ల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సిమెంట్ తయారీదారుల సంఘానికి కూడా భారీగా జరిమానా విధించింది. మార్కెట్ లో డిమాండ్ ఉన్నపుడు సిమెంట్ ధరలు అమాంతం పెరిగిపోవడం, ఒక్కోసారి ప్రభుత్వ అవసరాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు కూడా సిమెంట్  లభ్యం కాకపోవడం వెనుక సిమెంట్  పరిశ్రమల అత్యాశే కారణమని స్పష్టమైంది. సిమెంట్  పరిశ్రమల తీరుతో తీవ్రంగా నష్టపోయిన బిల్డర్స్  అసోసియేషన్ న్యాయం కోసం కాంపీటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది. సిమెంట్ కృత్రిమ కొరత వ్యవహారంపై విచారణ జరిపిన సిసిఐ 11కంపెనీలకు భారీగా జరిమానా విధించింది. ఏసిసి, అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్, గ్రాసిం సిమెంట్స్, జేకే సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, మద్రాస్  సిమెంట్స్, సెంచూరీ సిమెంట్స్, బినానీ సిమెంట్స్, లాఫర్జ్ ఇండియా, జైపీ 8eeసిమెంట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సిసిఐ నిర్ధారించింది. అక్రమాలకు పాల్పడిన సంస్థలు దేశీయ సిమెంట్ అవసరాలను తీర్చే సామర్ధ్యం ఉన్నా ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించి మార్కెట్ లో ధరలు అమాంతం పెంచేశాయని సిసిఐ గుర్తించింది.  ఉత్పాదకతను తగ్గించడం ద్వారా దేశ ప్రయోజనాలను దెబ్బతీసే కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తామని సిసిఐ ప్రకటించింది. అక్రమాలకు పాల్పడిన సిమెంట్ కంపెనీల లాభాల ఆధారంగా ఆరువేల కోట్లు  జరిమానాగా విధించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress and bjp fight for president post
Race horse distruction in anantapur district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles