Yuvraj singh eyes icc world t20 to return to cricket

Yuvraj Singh eyes ICC World T20 to return to cricket,Yuvraj Singh,worldt202012news,yuvrajzone, India, South Africa, United Kingdom, United States, Stuart Broadat, Yuvraj Singh

Yuvraj Singh eyes ICC World T20 to return to cricket

Yuvraj.gif

Posted: 06/21/2012 10:40 AM IST
Yuvraj singh eyes icc world t20 to return to cricket

Yuvraj Singh eyes ICC World T20 to return to cricket

ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుని ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సెప్టెంబర్‌లో జరిగే ట్వంటీ-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మళ్లీ బరిలోకి దిగగలనని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. క్యాన్సర్ వ్యాధితో తన దేహం తీవ్రమైన షాక్‌కు గురైందని, దీని తీవ్రత ఏమిటో క్యాన్సర్ బారిన పడిన తనలాంటి వారికి తప్ప ఇతరులకు అర్ధం కాదని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ భారత్ తరఫున ఆడటం తనకు పెద్ద సవాలేనని ‘ఐసిసి క్రికెట్ 360’ షోలో యువీ అంగీకరించాడు. అయితే క్రికెట్ మైదానంలో మళ్లీ ఖచ్చితంగా ఎప్పుడు దిగుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు యువరాజ్ నిరాకరిస్తూ, ఇటువంటి ప్రశ్నలకు ఇప్పుడే బదులివ్వడం అపరిపక్వతే అవుతుందన్నాడు. ‘క్రికెట్‌ను మళ్లీ ఎప్పటి నుంచి కొనసాగించాలన్న దానిపై నేనేమీ నిర్ధిష్ట కాలపరిమితిని నిర్ధేశించుకోలేదు. క్యాన్సర్ నేను ఎలా కోలుకుంటున్నానో, ఎంత త్వరగా మళ్లీ మైదానంలోకి దిగగలుగుతానో వేచిచూడాల్సి ఉంది. త్వరగా మళ్లీ బరిలోకి దిగాలని గానీ, అరకొర ఫిట్‌నెస్‌తో ఆడాలని గానీ నేను కోరుకోవడం లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ఆరు మాసాల సమయం పడుతుందో లేక రెండు నెలల సమయం పడుతుందో నాకు తెలియదు. కానీ పూర్తి ఫిట్‌నెస్ సాధించానన్న భావన నాలో కలిగిన నాడు తప్పకుండా మళ్లీ బరిలోకి దిగుతా’ అని యువీ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoists kidnap 19 railway employees release all of them later
Koti kumkumarchana at kanaka durga temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles