India 6th in top ten wealth markets

India 6th in top ten wealth markets, Wealth markets Indian Economy Growth Prospects of Indian economy

India 6th in top ten wealth markets!

India.gif

Posted: 06/19/2012 11:50 AM IST
India 6th in top ten wealth markets

India 6th in top ten wealth markets!

ప్రపంచంలోని టాప్ టెన్ సంపన్న మార్కెట్లలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. 2011 చివరికి టాప్‌టెన్ సంపన్న మార్కెట్ల జాబితాలో పదో ర్యాంక్‌లో ఉన్న భారత్, ఈఏడాది నాలుగుమెట్లు ఎగబాకి ఆరోస్థానంలోకి చేరుకోనుంది. 2012లో అగ్రగామి సంపన్న మార్కెట్ల జాబితాలో భారత్ ఆరోస్థానంలో నిలువనుందని డెటామానిటర్ తమ 2012 గ్లోబల్ వెల్త్ మార్కెట్ నివేదికలో పేర్కొంది. యూరో భవితపై తొలగని అనిశ్చితి, ఐరోపా సావరిన్ సంక్షోభం మరింత ముదిరి సమస్య తీవ్రత కొనసాగుతోంది. అయినప్పటికీ వర్ధమాన మార్కెట్ల ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తాయని భావిస్తున్నట్లు నివేదిక తెలియజేసింది.  సంపన్న మార్కెట్ల ప్రపంచ క్రమంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్థమాన దేశాల ఆర్థికరంగాలు పాశ్చాత్య ఐరోపా ప్రత్యర్థులను అధిగమించే ధోరణి కనిపిస్తోందని డెటామానిటర్ అభిప్రాయపడింది. 2011 సంవత్సరం చివరికి డాలర్ మిలియనీర్ హోల్డింగ్స్‌లో టాప్‌టెన్ సంపన్న మార్కెట్లలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇండియా ఉన్నాయి. 2012 చివరికి భారత్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరగలదని భావిస్తున్నట్లు నివేదికలో అంచనా వేశారు. ఇక 2015 చివరికి టాప్ టెన్ సంపన్న మార్కెట్ల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగితే చైనా ద్వితీయ స్థానం కైవసం చేసుకుంటుందని నివేదిక తెలిపింది. జపాన్ (3వ ర్యాంక్), బ్రిటన్ (నాలుగు), జర్మనీ (ఐదు), భారత్ (ఆరు), బ్రెజిల్ (ఏడు), ఇటలీ (ఎనిమిది), కెనడా (తొమ్మిది), ఫ్రాన్స్ (పది) స్థానాల్లో ఉంటాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iit bombay favourite among top 100 iit qualifiers
Us holds up 400 million dollar cheque to pak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles