32 killed in maharashtra bus accident

32 killed in Maharashtra bus accident,India,Maharashtra,transport accident,road accident,Maharashtra bus accident, Shirdi pilgrims accident

32 killed in Maharashtra bus accident

accident.gif

Posted: 06/16/2012 10:31 AM IST
32 killed in maharashtra bus accident

32 killed in Maharashtra bus accident

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి షిర్డి వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్‌ బస్సు ఈ రోజు తెల్లవారుజామున షోలాపూర్‌ సమీపంలోని నల్‌దుర్గ్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 34మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మనరాష్ట్రానికి చెందినవారే. మృతుల్లో అయిదుగురిని ఇంతవరకు గుర్తించారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లక్డీకాపూల్ నుంచి బయలుదేరిన బస్సు ఈరోజు వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులు షోలాపూర్‌లోని అశ్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 షిర్డీ బస్సు ప్రమాద ఘటనపై  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  తీవ్ర  దిగ్బ్రంతి వ్యక్తం చేశారు. తక్షణమే  మహారాష్ట్ర  ప్రభుత్వంతో  మాట్లాడి  క్షతగాత్రులకు మెరుగైన  వేద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని  ఆయన ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శి  పంకజ్ ద్వివేదిని  ఆదేశించారు.  మహారాష్ట్ర  సరిహద్దు జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి తగు సహాయం అందించేందుకు  అధికార  యంత్రాంగాన్ని  అప్రమత్తం  చేయాలని  సూచించారు.  ప్రమాదానికి  సంబంధించిన  సమాచారం అందించడం కోసం ప్రభుత్వం  తరపున  అవసరమైన సహాయక చర్యలు  తీసుకోవాల్సిందిగా  ఆయన ఆదేశించారు.

షిర్డీ వెళ్లాలని  చాలామంది బయలుదేరారు. శని, ఆది వారాలు  సెలవు దినాలు కావడంతో  సాప్ట్  వేర్  ఉద్యోగులు  ఉన్నట్లు తెలుస్తుంది.  ప్రమాదానికి లోనైన  షిర్డీ బస్సులో  14 మంది  టీసీఎస్  సాప్ట్ వేర్  సంస్థకు చెందిన ఉద్యోగులే  ఉన్నట్లు సమాచారం.   ప్రమాదంలో మరణించిన  వారి బంధువులకు  సమాచారం  అందించేలా  రెండు హెల్ప్ లైన్  నెంబర్లు  ప్రభుత్వం  అందుబాటులోకి  తెచ్చింది.  ప్రమాణికుల వివరాల కోసం  02472-222700, 02472-222900 లను  అందుబాటులోకి తెచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranab thanks sonia says she pm will decide new fm
Reporter heckles president barack obama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles