Azad kiran chiru to campaign for by polls in ongole

Azad, Kiran, Chiru to campaign for by-polls in ongole,

Azad, Kiran, Chiru to campaign for by-polls in ongole

Chiru.gif

Posted: 06/04/2012 06:01 PM IST
Azad kiran chiru to campaign for by polls in ongole

Azad, Kiran, Chiru to campaign for by-polls in ongole

ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం కాంగ్రెస పార్టీ  ఒంగోల్లో  పచార పర్యటన మొదలు పెట్టింది. ఒంగోలు ఎమ్మెల్యే గా  పోటీ చేస్తున్న  మాగుంట పార్వతమ్మ కు మద్దతుగా ..ఎంపి  మెగా స్టార్  చిరంజీవి , ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి  గులామ్ నాబి ఆజాద్ లు ప్రచారం చేయటం జరిగింది. చిరంజీవి మాట్లాడుతూ.. కొడుకుకు అన్యాయం జరిగిందన్న వైఎస్ విజయమ్మకు వాన్‌పిక్ బాధితుల గోడు పట్టదా అని కాంగ్రెస్‌నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో నీతికి, అవినీతికి మధ్యే పోటీ అని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు రోడ్ షో నిర్వహించారు.  ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు ఆజాద్, కిరణ్, చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాంనబీ ఆజాద్ ప్రసంగిస్తూ వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చుకోడానికే జగన్ డ్రామాలాడుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ సంతకాలు సేకరించడం తనను ఆశ్చర్యపరిచిందని ఆజాద్ పేర్కొన్నారు.  "టంగుటూరి ప్రకాశం పంతులు మీద ఒట్టు వేసి చెబుతున్నాను. జగన్ మీద మేము కక్ష సాధించడం లేదు''అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న ఆయన జగన్ జైలుకెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని పునరుద్ఘాటించారు.హైకోర్టు ఆదేశాల మేరకే జగన్‌పై సీబీఐ విచారణ జరుగుతోందని, ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఎంత మాత్రమూ లేదని చెప్పుకొచ్చారు. అవినీతికి పాల్పడడం వల్లనే జగన్ జైలుకు వెళ్ళారని స్పష్టం చేశారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకే జగన్ హైడ్రామా ఆడుతున్నారని అన్నారు. వైఎస్ మరణంపై విజయమ్మ వ్యాఖ్యలను ఖండించారు.

తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తికి ఓటు వేస్తే జరిగే పరిణామాలేమిటో ఊహించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. అసలు జగన్ స్వార్థం వల్లనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఉప ఎన్నికల్లో లబ్ది కోసం వైఎస్ మృతిని కూడా రాజకీయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్నీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. నగరంలోని కొత్తపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా సీఎం లాయర్ పేట చేరుకుని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం గులాం నబీ ఆజాద్, పురందేశ్వరి, పనబాక లక్ష్మితో కలిసి రోడ్ షో నిర్వహించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi in karnataka with eye on polls
Vatileaks scandal as more confidential documents leaked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles