Vatileaks scandal as more confidential documents leaked

Pope Benedict gets no respite from Vatileaks scandal as more confidential documents leaked

Pope Benedict gets no respite from Vatileaks scandal as more confidential documents leaked

Pope Benedict gets no respite from Vatileaks scandal.gif

Posted: 06/04/2012 04:30 PM IST
Vatileaks scandal as more confidential documents leaked

Pope-Benedictవాటికన్ సిటీ మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. వాటికన్ సిటీలోని రహస్యాలు తరలిస్తున్నాడన్న అనుమానంతో పోప్ బట్లర్‌ను అరెస్ట్ చేసి పది రోజులు గడవ క ముందే, వాటికన్ సిటీ నుంచి మరికొన్ని రహస్య ప్రతాలు బయటపడ్డాయి. వాటికన్ సిటీ నుంచి రహస్యంగా త స్కరించిన మూడు రహస్య ప్రతాలను గుర్తు తెలియని వ్యక్తి 'లా రిపబ్లికా' వార్తాపత్రికకు పంపడంతో ఈ గొడవ ఇంతటితో సమసి పోలేదని అర్థమవుతోంది.

ఇన్నాళ్లూ వాటికన్ సిటీలో ఇన్ఫార్మర్లు ఎవరూ లేరని బుకాయిస్తూ వచ్చిన వాటికన్ సిటీకి ఇది మింగుడు పడ డం లేదు. రహస్య పత్రాలతో పాటూ 'లా రిపబ్లికా'కు పంపిన ఉత్తరంలో... 'పై స్థాయి'లో ఉన్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పోప్ బెనెడిక్ట్ వ్యక్తిగత సహాయకుడు జార్జ్ గేన్‌స్వేన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. గేన్‌స్వేన్, నెంబర్ టూ స్థానంతో ఉన్న కార్డినల్ బెర్టోన్‌లే వాటికన్ సిటీలో అక్రమాలకు కారకులని ఈ రహస్య పత్రాలలో ఆరోపించారు. అయితే ఈ తతంగమంతా అధికారం కోసం జరుగుతున్న పోరులో భాగంగానే కొనసాగుతోందని భావిస్తున్నారు. నెంబర్ టూ బెర్టోన్‌కు చెక్ పెట్టడానికే ఈ రహస్య పత్రాల లీకేజీని సృష్టించారని తెలుస్తోంది.

అయితే ఇటీవల బలహీనపడిన పోప్ బెనెడిక్ట్, తన వారసుడ్ని సిద్ధం చేసుకుంటున్నాడనీ, ఇది నచ్చని కొందరు కార్డినన్స్ ఈ రహస్య ప్రతాలను లీక్ చేసి ఉంటారన్నది మరో కథనం. ఈ రహస్య పత్రాలలో చర్చి పన్ను సమస్యలు, పిల్లల పై లైంగిక అకృత్యాలు, సాంప్రదాయ తిరుగుబాటుదారులతో చర్చికున్న సంబంధాలు... వగైరా వివరాలన్నీ ఉన్నాయి. గతంలో రహస్య పత్రాలను తరలిస్తున్నాడనే అనుమానంతో అరెస్టైన్ పోప్ బట్లర్ గ్యాబ్రియేల్, ఈ మొత్తం వ్యవహారంలో ఒక పావుగా మారాడని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Azad kiran chiru to campaign for by polls in ongole
Bus body building unit in vijayanagaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles