Govt comes out with one mp one idea scheme

The government has announced a new scheme, ‘One MP-One Idea’ to encourage people to come out with sustainable and scalable solutions for local problems in areas such as health, education and banking. Under this scheme, people will receive cash awards of 2.5 lakh rupees , 1.5 lakh rupees and 1 lakh rupees

The government has announced a new scheme, ‘One MP-One Idea’ to encourage people to come out with sustainable and scalable solutions for local problems in areas such as health, education and banking. Under this scheme, people will receive cash awards of 2.5 lakh rupees , 1.5 lakh rupees and 1 lakh rupees

Govt comes out with One MP One Idea scheme.gif

Posted: 05/29/2012 03:58 PM IST
Govt comes out with one mp one idea scheme

ప్రస్తుతం అమలు చేయబోతున్న ఈ ఐడియాని చూస్తే... సామెత మాదిరి ఉంది. తనకు చేతకాక ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారం కనుగొమని ప్రజలకే సూచిస్తుంది. విషయం ఏంటంటే... ఏదైనా సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఓ అద్భుతమైన ఐడియా ఉందా!? మీరు చెవినిల్లు కట్టుకుని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదా!? మీరు నిరాశ చెందొద్దు! మీ ఐడియాను ప్రభుత్వానికి చెప్పండి! ఆ సమస్య పరిష్కారం కావడమే కాదు.. మీకు పెద్దఎత్తున నగదు బహుమతి కూడా రానుంది!

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 'ఒక ఎంపీ - ఒక ఐడియా' పేరిట కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంటు సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి పథకం (ఎంపీ ల్యాడ్స్) కింద కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల నిర్వహణ శాఖ ఈ పథకాన్ని ప్రకటించింది. స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నట్లు కేంద్ర కార్యక్రమాల నిర్వహణ శాఖ మంత్రి శ్రీకాంత్ జెనా సోమవారం ప్రకటించారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలోని స్థానిక ప్రజల నుంచి వివిధ సమస్యలకు వినూత్న పరిష్కారాలను సేకరించి.. ఏటా మూడు ఉత్తమమైన ఆలోచనలకు నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని ఆయా లోక్‌సభ సభ్యుల విజ్ఞప్తిమేరకు వారి నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. వచ్చిన పరిష్కారాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, మూడు ఉత్తమ పరిష్కారాలను ఎంపిక చేస్తుందని, ఎంపికైన వాటిలో మొదటి బహుమతి కింద రూ.2.5 లక్షలు; రెండో బహుమతి కింద రూ.1.5 లక్షలు; మూడో బహుమతి కింద రూ.1 లక్ష అందజేస్తామని తెలిపారు. ఈ బహుమతులను ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా అందజేస్తామన్నారు. వీటితోపాటు ఐదు వినూత్న పరిష్కారాలకు ప్రోత్సాహక సర్టిపికెట్లు ఇస్తామని తెలిపారు.

ఇలా ఆశ పెట్టించి వినూత్న ఐడియాలు అన్నీ తెలుసుకొని చివరకు ఐడియాలు ఇచ్చిన వారికి హ్యాండ్ ఇవ్వదు కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana fires on jagan
Lanco infratech to sell its roads business  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles