Kashi vishwanath temple to offer pious manure

Kashi Vishwanath temple to offer 'pious' manure,Devotees usually carry offerings to a temple but the devout visiting the world famous Kashi Vishwanath temple here will now get something to take back

Kashi Vishwanath temple to offer 'pious' manure

Kashi.gif

Posted: 05/21/2012 06:22 PM IST
Kashi vishwanath temple to offer pious manure

Kashi Vishwanath temple to offer 'pious' manure

వినాయక చవితికి గణేశుడికి సమర్పించే పూలూపత్రీ తీసుకెళ్లి చెరువులో కలుపుతాం. ఇది మరో సందర్భం. కానీ.. కాశీలో విశ్వనాథుడి గుడిలో భక్తులు సమర్పించే పూలూ పళ్లూ పాలూ అన్నీ కలిపి రోజుకు చెరువులో కలుపుదామంటే.. అది రెండు రోజుల్లో నిండిపోతుంది. గుడికెళ్తాం. కొబ్బరికాయ కొడతాం. శివాలయమైతే.. పాలతో అభిషేకం చేయిస్తాం. పూలు, పళ్లు సరేసరి! ఆ పూలూ పళ్లూ మర్నాటికి ఎండిపోతాయి. దాన్ని నిర్మాల్యంగా భావించి గుడిపక్కన పడేస్తారు. కొంతకాలానికి అదే చివికిపోయి భూమిలో ఇంకిపోతుంది. ఇది ఒక సందర్భం. టన్నుపైగానే బరువు తూగుతాయి. గుడిపక్కన పడేయటానికి అక్కడ చోటు కూడా ఉండదు.

అందుకే ఆ నిర్మాల్యాన్నంతా తీసుకెళ్లి గంగలో విడుస్తారు. దానివల్ల గంగానది కాలుష్యకాసారంగా మారిపోతుండటంతో.. గమనించి, ఆవేదన చెందిన శ్రీప్రకాష్ రఘువంశీ అనే రైతు దీనికో అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. "విశ్వనాథుడి నిర్మాల్యాన్ని గంగపాలు చేయడమెందుకు.. నాకు ఇవ్వండి దాన్ని నేను పవిత్రమైన ఎరువుగా మారుస్తాను'' అని ఆలయ అధికారులకు ప్రతిపాదన పెట్టాడు. ఆ ఆలోచన నచ్చడంతో ఆలయవర్గాలు కూడా అందుకు సరేనన్నాయి. ఈమేరకు అరుదైన ఒప్పందం జరిగింది.

శ్రీప్రకాష్ రఘువంశీ అంటే చిన్నా చితకా రైతు కాదండోయ్! పేరొందిన పరిశోధకుడు కూడా. తన పొలంలో ఇప్పటిదా 100 రకాల విత్తనాలను ఉత్పత్తి చేసి రాష్ట్రపతి మెడల్‌ను రెండుసార్లు అందుకున్న ఘనత ఆయన సొంతం. విశ్వనాథుడికి రోజూ భక్తులు సమర్పించుకునే నిర్మాల్యానికి ఆయన రూ.211 చెల్లించి నగరంలో తనకున్న ఎరువుల ఉత్పత్తి కర్మాగారానికి తరలిస్తాడు. అక్కడ దాన్ని సారవంతమైన ఎరువుగా మార్చి అవసరమైన రైతులకు అతి తక్కువ ధరలకే విక్రయిస్తాడట. అన్నట్లు.. మధ్యప్రదేశ్‌లోనూ ఆయనకు ఇలాంటిదే మరో ప్లాంటు ఉంది. అక్కడ ఉజ్జయినిలో కొలువై ఉన్న మహాకాళేశ్వరుడి ఆలయ వర్గాలతో కూడా ఇలాంటిదే ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఆయన ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cambridge professor given dr manmohan singh chair offer at punjab university
Ka paul arrested on murder charge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles