Lk advani and pranabh mukharji and arun jaiitly speaks

lk advani and pranabh mukharji and arun jaiitly speaks ..

lk advani and pranabh mukharji and arun jaiitly speaks ..

7.gif

Posted: 05/13/2012 02:52 PM IST
Lk advani and pranabh mukharji and arun jaiitly speaks

      ప్రపంచ దేశాల్లో.. భారత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అన్నారు. ఈ 60 ఏళ్లలో భారతదేశం ఎంతో ఎత్తుకు ఎదిగిందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయిన లోక్‌సభలో ఆయన మాట్లాడారు.3 మహాత్మ గాంధీ లాంటి మహోన్నత వ్యక్తి ఈ విశ్వంలో ఎక్కడా కనబడరని అద్వానీ అన్నారు. బాపూజీని మొదటిసారి కరాచీలో చూశాను, ఆ తర్వాత మళ్లీ ఇక్కడ చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్ భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు, ధోరణుల సమాహారమని, వీటిని కాపాడుకోవడంలోనే మన ప్రజాస్వామ్య విజయం దాగుందని తెలిపారు.
      మరోవైపు భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.2 భారత రాజ్యాంగాన్ని ప్రజలే నిర్మించుకున్నారని, దాని ప్రకారమే పార్లమెంట్ నడుస్తోందని చెప్పారు. దేశంలో తలెత్తిన ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో ఈ సభ సఫలమయిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయిన లోక్‌సభలో ఆయన చర్చను ప్రారంభించారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా చట్టాలు తేవడంలో పార్లమెంట్ పాత్ర సమోన్నతమైనదని ఆయన ప్రశంసించారు. ఎక్కడో ప్రారంభమయ్యాం, ఇక్కడ ఉన్నాం, ఎంతో సాధించాం, ఇంకా సాధించాల్సివుందని ప్రణబ్ ప్రసంగం ముగించారు. కాగా, 60 ఏళ్ల ప్రజాస్వామ్యంలో మనం ఎన్నో మైలు రాళ్లు అధిగమించామని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. జాతి నిర్మాణంలో 60 ఏళ్లు చిన్న భాగం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jac leaders talk about parakala seat
Pm manmohan singh and sonia gandhi speeks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles