Mp chiranjeevi fire on jagan media

mp chiranjeevi fire on jagan media

mp chiranjeevi fire on jagan media

9.gif

Posted: 05/13/2012 01:34 PM IST
Mp chiranjeevi fire on jagan media

       తన మీద సాక్షి మీడియా కథనాలపై రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్రంగా స్పందించారు.   ‘‘జగన్.. నీ చానల్‌లో నాపై కక్షతో దుష్ప్రచారం చేస్తావా? గతంలో వైఎస్ తరచు చెప్పినట్లు బట్టకాల్చి ముఖం మీద వేసే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నావా? ఇదేనా నీ జర్నలిజం? దీనిపై న్యాయపరంగా పోరాడుతా. నీ చానల్‌పై పరువునష్టం దావా వేస్తా. నాకున్న బలం నిజాయితీ. అక్రమంగా డబ్బు సంపాదించే అగత్యం నాకు లేదు’’ అని వైఎస్ జగన్‌పై రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నిప్పులు చెరిగారు.  నిజం నిప్పులాంటిది. అది ఏనాటికైనా బయట పడుతుంది. నా వియ్యంకుని వియ్యంకుడు నందగోపాల్‌కు చాలా వ్యాపారాలున్నాయి. ఆయన ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేశారు. వారి బంధువులుగా నా వియ్యంకుని ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఇది చాలా చిన్న విషయం. అయితే.. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని నాపై బురద జల్లేలా దుష్ప్రచారం చేసి.. అనుమానాలు రేకెత్తేలా జగన్ చానల్ అసత్య ప్రచారం చేయడం ఏమిటి? అని మండిపడ్డారు. chiru
      నేను హుటాహుటిన చెన్నైలోని నా కూతురు ఇంటికి వెళ్లానని.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి ప్రణబ్ ముఖర్జీ వద్ద వాపోయానని దుష్ప్రచారం చేస్తావా? ఇదేనా నీ జర్నలిజం? ఇదేనా నైతికత' అని జగన్‌ను చిరంజీవి నిలదీశారు. "మా అబ్బాయి పెళ్లి పనుల దృష్ట్యా మా పెద్దమ్మాయి వారం రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంది. నేను ఆమెను పరామర్శించడానికి వెళ్లడమేంటి? నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. నేను ఢిల్లీ వెళ్లి ప్రణబ్‌ను కలవడం ఏంటి? ఇదంతా తిరుపతి ప్రచారంలో నేను చేసిన ప్రసంగాల నేపథ్యంలో కక్షతో చేస్తున్నవే. ఇది వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠను దిగజార్చడం తప్ప మరొకటి కాదు. నా ప్రతిష్ఠను మంటగలిపే అధికారం ఎవరిచ్చారు? నాపై దుష్ప్రచారం చేసిన జగన్ మీడియాపై పరువునష్టం దావా వేస్తా. దీనిపై తక్షణమే న్యాయవాదులను సంప్రదిస్తా' అని జగన్‌ను చిరంజీవి హెచ్చరించారు. ఇలాంటి దిగజారుడు పనులను ప్రజలు అర్థంచేసుకుంటున్నారని త్వరలోనే నీ నిజరూపాన్ని ప్రజలే ఎండగడతారని వ్యాఖ్యానించారు చిరు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader chandrababu blame jagan
Sixty years of indian parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles