Ka paul says i will reveal jagan anils illegal activities

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Prajasanthi Party chief, well known chistian preacher Kilari Anand Paul said, he will be reveal YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's and Brother Anil Kumar's illegal activities soon. He said his party is ready to contest in five constituencies

KA paul says i will reveal jagan anils illegal activities.GIF

Posted: 04/30/2012 12:45 PM IST
Ka paul says i will reveal jagan anils illegal activities

KA-Paulప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, సువార్త ప్రచారకుడు కెఏ పాల్ ఈ మధ్య కాలంలో తనదైన శైలిలో వైయస్ కుటుంబం పై విరుచుకుపడుతున్నారు. గతంలో ఆయన నన్ను అణిచివేయాలని చూసిన వారు అనంతలోకాలకు వెళ్ళారని విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా వైయస్ కుమారుడు జగన్, అల్లుడు అనిల్ పై విరుచుకుపడ్డారు.

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్‌ల అవినీతి కార్యకలాపాలను త్వరలోనే తాను బయటపెడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, సువార్త ప్రచారకుడు కెఏ పాల్ అన్నాడు.

జగన్, అనిల్ కుమార్‌లు తనను ఎలా ఇబ్బంది పెట్టారో, ఎంతలా ఇబ్బందులకు గురి చేశారో త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. తనకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని వారు కలిగించారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతిదారుణమైనదిగా అభివర్ణించారు. ఆయన హయాంలో తనకు జరిగిన అన్యాయం ఆషామాషీ కాదన్నారు. 2007లో వైయస్‌కు లంచం ఇవ్వకపోవడం వల్లనే తనపై కక్ష పెంచుకొని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అయిదు స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, ప్రత్తిపాడు, ఒంగోలు స్థానాల నుండి అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaya bachchan urges seat change rekha effect
Gang rape in vishakha district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles