Reception for mega fance on 15th june chiranjeevi

reception for mega fance on 15th june ..chiranjeevi

reception for mega fance on 15th june ..chiranjeevi

1.gif

Posted: 04/28/2012 11:41 AM IST
Reception for mega fance on 15th june chiranjeevi

       chiru-waving1 జూన్ 14న రామ్ చరణ్ వివాహం జరుగుతుందని, 15న అభిమానలకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కొద్ది సేపటిక్రితం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుందని ఈ రాజ్యసభ సభ్యుడు , చిరంజీవి వెల్లడించారు.  రెండు మూడు రోజుల్లో అభ్యర్ధుల విషయంపై తుది నిర్ణయం రావచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉదయం విశాఖ వచ్చిన చిరంజీవి పలు అంశాలమీద మాట్లడారు. తిరుపతి అభ్యర్థి కోసం తాను ఎవరిని సిఫార్సు చేయలేదని, తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని చిరు స్పష్టం చేసారు. రాజ్యసభ ఎంపిగా ఉన్న తనను మంత్రిగా చేయాలన్నది అధిష్టానం నిర్ణయమని ఈ విషయంలో ఎలాంటి డిమాండ్లు లేవనన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పీఆర్పీ అభ్యర్థులను ఉపఎన్నికల కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. అనంతరం చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో చిరు పాల్గొంటారు. కార్యకర్తలతో సమావేశమవుతారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister for road and buldings dharmana prasadarao fire on jagan
Trs president kcr says after by pols there is a  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles