Congress and tdp leaders fire on jagan

congress and tdp leaders fire on jagan

congress and tdp leaders fire on jagan

33.gif

Posted: 04/26/2012 10:02 PM IST
Congress and tdp leaders fire on jagan

                 Y.S_Jagan_KCR_tie_upజగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యి చాలా పెద్ద కుట్రనే పన్నుతున్నారని విమర్శిస్తున్నారు ఇటీవల కాలంలో చాలా మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు. అయితే ఇవాళ తాజాగా, ఇదే అంశంమీద వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. జగన్-కేసీఆర్  రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్నారని, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  సమైక్యవాదులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. పరిటాలరవి, సూరి హత్యల నిందితులతో జగన్‌కు సంబంధాలు ఉన్నాయని, దీనిపై మరోసారి విచారణజరపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
             ఇదిలా ఉండగా మరోవైపు  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్యలో జగన్ హస్తం ఉందని, అనంతపురం కోర్టు తీర్పుతో అదే రుజువైందని టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కోడెల శివప్రసాద్ విమర్శించారు.vee నేర చరిత్రతో జగన్‌కు విడదీయరాని సంబంధముందన్నారు. మంగలి కృష్ణతో జగన్‌కు లింకుందని సీబీఐ ఏప్పుడో చెప్పిందని, జగన్‌కు ఓటేస్తే భస్మాసుర హస్తంలో చిక్కుకున్నటే  అని నేతలు ఆరోపించారు. జగన్ వంటి మేకవన్నె పులులను తరిమికొట్టాలని టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కోడెల శివప్రసాద్ తీవ్రవిమర్శలు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi and sonia gandhi meeting to day in delhi
Rs ten laks worth gaja found in train  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles