Rebal star krishnam raju re entry into politics

rebal star krishnam raju re entry into politics

rebal star krishnam raju re entry into politics

1.gif

Posted: 04/25/2012 10:16 AM IST
Rebal star krishnam raju re entry into politics

                Krishnam_Raju ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు కు పదవులంటే మక్కువ ఎక్కువ. ఏదో విధంగా ఎంపీనో ఎమ్మెల్యేనో అయిపోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల ముందు సరికొత్త ప్రకటనలు చేస్తుంటారు. అది.. ఇదీ అని తరతమ భేదం లేకుండా ఏదో పార్టీ చెంతన చేరి ఎన్నికల్లో ఓ రాయి విసురుతుంటారు. అదే పంధా ను వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించే ప్రయత్నాల్లో కృష్ణంరాజు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
                తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తాజాగా ఈ  మాజీ ఎంపీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఇవాళ (బుధవారం) తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కృష్ణంరాజు మనసులోని మాటను బయటపెట్టారు. ప్రజల ఇబ్బందుల్ని చూసే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్లపాటు క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకుని ప్రజలతో మమేకమవటం కంటే, ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకురావటం విడ్డూర మంటున్నారు అదే ప్రాంత ప్రజలు. చూడాలి ఈ ఎన్నికల్లో నైనా కృష్ణంరాజును పదవి వరిస్తుందో లేదో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big reshuffle in congressold ministers to come back
Acb arrests khammam ex collector in liquor case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles