Senior inter results release

senior inter results release

senior inter results release

1.gif

Posted: 04/24/2012 10:38 AM IST
Senior inter results release

                 girls_inter_apవిద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను ఈ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. బాలికల ఉత్తీర్ణత 61.25 శాతం కాగా బాలుర ఉత్తీర్ణత 55.95 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.98 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 74 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 43 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ చివరి స్థానంలో ఉంది.
           ఈ దఫా విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం మార్కులు/గ్రేడులతో సహా ఫలితాలను ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంచారు. తామన్నారు. ఈ-సేవా కేంద్రాల్లోని 'పరిష్కారం కాల్ సెంటర్' ద్వారా ఫలితాలను రాష్ట్రంలోని ఏ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ద్వారానైనా 1100కు డయల్ చేసి కూడా తెలుసుకునే సదుపాయం కల్పించారు. అలాగే రాష్ట్రంలోని ఏదేని ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 18004251110కు ఫోన్‌చేసి గానీ, ఈ-సేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్ల నుంచి గానీ తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A raja does not want bailprefers to come out clean
Dasari sayseven phalke award can be managed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles