Dasari sayseven phalke award can be managed

Phalke awards,Padma Vibhushan,Padma Bhushan,Noted filmmaker Dasari Narayana Rao

Noted filmmaker Dasari Narayana Rao has made controversial statements on awards for film stars alleging that the awards, both at the state and national level could be got through influence and lobbying

Dasari says_Even Phalke award can be managed.GIF

Posted: 04/24/2012 10:19 AM IST
Dasari sayseven phalke award can be managed

Dasari-narayana-raoఈ మధ్య కాలంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా సినిమా ఇండస్ట్రీ పైనా, నటుల పైనా ఏదోఒక విమర్శ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో చిరంజీవి ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన దాసరి నిన్న జరిగిన ఓ సమావేశంలో అవార్డుల ఫంక్షన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

చిన్న చిన్న అవార్డుల నుంచి పద్మా అవార్డుల వరకు పైరవీలతోనే వస్తున్నాయని, స్టార్ల కోసమే అవార్డు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలకు స్టార్లు రావడం కోసం వారికి అవార్డులు ఇస్తున్నారని ఆయన అన్నారు. స్టార్లకే అవార్డులు ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. నిజాయితీ గల నటులను గుర్తించి వారికి కూడా అవార్డులు ఇవ్వాలని సూచించారు. ఈ పైరవీలతో సినిమాలకి ఇచ్చే అవార్డులకు గౌరవం తగ్గిందని ఆయన అన్నారు.  పద్మశ్రీ, పద్మభూషణ్ నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరకు పైరవీలతోనే వస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల కోసం పైరవీలు సాగించి అవార్డులు తెచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. మరి దాసరి చేసిన వాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద దుమారాన్ని రేపుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior inter results release
K jana reddy eyes cm post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles