Pak cricketer shahid afridi roughs

pak cricketer, shahid afridi, roughs

pak cricketer shahid afridi roughs

30.gif

Posted: 03/24/2012 07:45 PM IST
Pak cricketer shahid afridi roughs

           afridi_attack888888

    పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది దుందుడుకు తనం మరోసారి బయటపడింది. ఇవాళ కరాచిలో అఫ్రిది ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఆసియా కప్‌లో విజయం సాధించిన పాక్ జట్టు పాకిస్తాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్న సందర్భంలో ఈ సంఘటన తలెత్తింది.
           క్రికెటర్ల వద్ద ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అఫ్రిది వద్ద ఆటోగ్రాఫ్ తీసేందుకు యత్నించిన ఒక అభిమాని అతనిని తోసేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన అఫ్రిది ఆ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. అంతటితో వదలకుండా అభిమానిని పిడిగుద్దులు గుద్దాడు. అఫ్రిది అభిమానిపై చేయిచేసుకోవడం అక్కడున్న అధికారులు, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
         అయితే అభిమానుల తోపులాటలో తన మూడేళ్ల కూతురును నెట్టివేయడానికి ప్రయత్నించడం వల్లనే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆఫ్రిది తెలిపారు. తాను అలా ప్రవర్తించడం తప్పేనని, ఆ సమయంలో తనకు తాను నియంత్రించుకోలేక పోయానని, తన కూతురి పరిస్థితిపై ఆందోళనకు లోనై ఆ విధంగా ప్రవర్తించానని పాక్ పత్రికకు వివరణ ఇచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  10 kilos gold found in krishna district
India expo 2012 starts hyderabad today onwards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles