Kingfisher top brass to meet dgca today

Kingfisher top brass to meet DGCA today,kingfisher airlines, mallya, dgca, bharat bhushan, Home,Kingfisher, Kingfisher airlines, Vijay Mallya, Kingfisher crisis, Ajit Singh, DGCA

Kingfisher top brass to meet DGCA today

Kingfisher.gif

Posted: 03/21/2012 10:36 AM IST
Kingfisher top brass to meet dgca today

Kingfisher top brass to meet DGCA today

విలాసాల కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రెక్కలు తెగిన పక్షిలా గిలగిల కొట్టుకొంటోంది. మద్యం సామాజ్రాధినేత విజయమాల్యాకు చెందిన ఈ ఎయిర్‌లైన్స్‌ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసే సంకేతాలు వెలువడుతున్నాయి. నిర్ధిష్ట భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా, ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడకపోయినా కింగ్‌ఫిషర్‌ లైసెన్సులను రద్దు చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ హెచ్చరించారు. పునరుద్ధరణ ప్రణాళికకు కట్టుబడి వుండడంలో కూడా ఆ సంస్థ విఫలమైందని మంత్రి తెలిపారు.

కింగ్‌ఫిషర్‌ తన విమాన సర్వీసులను, కార్యాకలాపాలను దాదాపు పూర్తిగా కుదించుకునేందుకు సిద్ధపడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేవలం 15 లేదా 16 విమానాలు నడిపేందుకు మాత్రమే ఆ సంస్థ ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని సమాచారం. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ భరత్‌ భూషణ్‌తో విజరు మాల్యా సమావేశమై ఓ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనుందని పేర్కొన్నాయి. వచ్చే ఏప్రిల్‌ పదో తేదీన ఢిల్లీ నుంచి లండన్‌కు నడపనున్న సర్వీస్‌తో కింగ్‌ఫిషర్‌ అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు తెర పడనున్నట్లు తెలుస్తోంది. కాగా తమ సంస్థ సిబ్బంది అందరికీ త్వరలోనే జీతాలు చెల్లిస్తామని భరత్‌తో భేటీ అనంతరం విజయ మాల్యా తెలిపారు. ఐఎటిఐ అధికారులతో సమావేశమ య్యేందుకు తమ బృందం ఒకటి జెనివాకు వెళ్లనుందని, రుణాల కోసం అధిక వడ్డీ చెల్లించేందుకు పరితపిస్తున్నామని తెలిపారు. వేసవి కాలానికి తమ సర్వీసుల షెడ్యూల్‌ను, వంద శాతం భద్రతా ప్రమాణాల హామీతో డిజిసిఎకు సమర్పించామని మాల్యా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gay sport figures among olympics torch bearers
Andhra pradesh by election vote counting poll results 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles