Chanchalguda jail housefull with vips

Chanchalguda jail housefull with VIPs, Gali, Janardhan, Reddy, in, Jail, Leaders, Scams, CBI, Investigations, court, bail, Petition, on, Gali's, life, outside

Chanchalguda jail housefull with VIPs

Chanchalguda.gif

Posted: 03/14/2012 12:21 PM IST
Chanchalguda jail housefull with vips

chan

మద్యం సిండికేట్ల వ్యవహారం చెంచల్‌గూడ జైలు అధికారులకూ వణుకు పుట్టిస్తున్నది. ఈ వ్యవహారంలో అరెస్టయిన పోలీసు అధికారులకు భద్రత కల్పించటం కారాగార అధికారులకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నది. ఇదే విషయాన్ని వివరిస్తూ చెంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ కేశవనాయుడు ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్‌కు లేఖ ఇచ్చారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయి తమ జైల్లో ఉన్నవారిని మరో కారాగారానికి తరలించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇకపై అధికారులను ఎవరినైనా అరెస్టు చేస్తే తమ జైలుకు రిమాండ్ కోసం పంపొద్దని విజ్ఞప్తి చేశారు. ఏసీబీ అధికారులు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై విస్తృతంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గరిష్ఠ చిల్లర ధర నిబంధనకు పాతరేసిన పలువురు మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు.

దీంతోపాటు నెలనెలా మామూళ్లు దండుకుంటూ మద్యం వ్యాపారుల అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేసిన ఖమ్మం, కర్నూలు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పనిచేస్తున్న ఎక్సైజ్, పోలీసు అధికారులను కూడా కటకటాల వెనక్కి పంపారు. ఇలా అరెస్టయిన ఏడుగురు పోలీసు అధికారులు ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో అండర్‌ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. కాగా ఈ అధికారులు గతంలో వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసిన పలువురు నిందితులు కూడా ఇదే జైల్లో ఉన్నారు. సరిగ్గా ఈ పరిణామమే జైలు అధికార వర్గాలను కలవరానికి గురిచేస్తున్నది. తమను అరెస్టు చేశారన్న కక్షతో జైల్లో ఉన్న నిందితులు మద్యం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయి కారాగారానికి వచ్చిన పోలీసు అధికారులపై ఎక్కడ దాడి చేస్తారోనన్న ఆందోళనకు లోను చేస్తున్నది. ప్రస్తుతం జైల్లో ఉన్న పోలీసు అధికారులకు రక్షణ కల్పించలేమని లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway ticket fares hike
Kiran seeks ags advice on mantris in trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles