Young turks akhileshsukhbir

akhilesh yadav, sukhbir singh badal, samajwadi party, uttar pradesh polls, parkash singh badal, shiromani akali dal, sad-bjp alliance, punjab polls, young voters

In Hindi heartland Uttar Pradesh, young voters unambiguously elect the Akhilesh Yadav-propelled Samajwadi Party and in Punjab the Shiromani Akali Dal (Badal) emerges a much more potent force under the guidance of party scion Sukhbir Singh Badal

Young Turks Akhilesh_ Sukhbir.gif

Posted: 03/07/2012 05:47 PM IST
Young turks akhileshsukhbir

Akhileshరాజకీయాల్లో తండ్రీ తనయులు రాణిస్తున్నారనడానికి ఇప్పుడు మనకు రెండు రాష్ట్రాలు ఉదాహరణగా నిలిచాయి. ఒకటి ఉత్తర ప్రదేశ్‌ అయితే, రెండోది పంజాబ్‌. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) సుప్రీం ములాయంసింగ్‌ యాదవ్‌ నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన తనయుడు అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. తను ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని, తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు నాలుగోసారి సిఎం కానున్న ములాయం మల్ల యుద్ధవీరుడు. 72 ఏళ్ల ములాయంకు కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం బాగాలేదు. ఒకప్పుడు దేశ రక్షణమంత్రిగా కూడా పనిచేసిన ములాయంసింగ్‌ యాదవ్‌ తన పెద్ద కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ను వారసుడిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పంజాబ్‌లో సీనియర్‌, జూనియర్‌ బాదల్‌ హవా ఇక్కడ పంజాబ్‌లో శిరో మణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అధినేత, 84 ఏళ్ల పోరాట యోధుడు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ అయిదోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన తనయుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒకే పార్టీ వరసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి తన తండ్రే అని సుఖ్‌బీర్‌ సింగ్‌ కూడా యూపీలో అఖిలేష్‌ చెప్పినట్టే చెప్పారు. అయితే ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మాత్రం సిఎంను పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అంతేకాదు, ఈ విజయం తన తనయుడు సుఖ్‌బీర్‌సింగ్‌దని అన్నారు. బాదల్‌ జూనియర్‌ 2008 జనవరి 31న తన తండ్రి వారసుడిగా శిరోమణి అకాలీదళ్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఏడాది తర్వాత, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. 50 ఏళ్ల సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ అమెరి కాలో ఎంబీఏ చేశారు. తండ్రీ కొడుకులు ప్రభు త్వంలో రెండు అత్యున్నత పదవుల్ని స్వీకరించడం ఇదే మొదటిసారి. తన కుమారుడు సుఖ్‌బీర్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి వుతారని 2009 జనవరిలో ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ప్రకటించడం కూటమిలో భాగస్వామి బీజేపీని విస్మయపరిచింది.

ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, తిరిగి శిరోమణి అకాలీదళ్‌కే ప్రజలు పట్టం కట్టడం విశేషం. బీజేపీ తో పొత్తు ఉన్న అకాలీదళ్‌ ప్రభుత్వ వ్యతిరేక తతో పాటు అవినీతి, బంధుప్రీతి ఆరోపణల్ని కూడా ఎదుర్కొంది. ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ గతంలో రెండు సార్లు 1997లోను, 2007లోను పూర్తికాలం అంటే అయిదేళ్లు పంజాబ్‌ సిఎంగా ఉన్నారు. అంతకు ముందు 1977-80, 1970-71లలో కూడా సీనియర్‌ బాదల్‌ సీఎంగా చేశారు. ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు 84 ఏళ్లున్నా, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆయనకు 90 ఏళ్లంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tata motors to come up with 100kmltr mileage car read more at httpindiatodayintodayinstorytata motors 100 km per litre car megapixel
Ys jagan security guards attack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles