Steep petrol price hike in the offing

Steep petrol price hike in the offing? petrol price hike,fuel prices,assembly elections 2012

Steep petrol price hike in the offing?

petrol.gif

Posted: 03/07/2012 12:23 PM IST
Steep petrol price hike in the offing

Steep petrol price hike in the offing?

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో ప్రజలపై మరోసారి ‘పెట్రో బాంబు’ పడటం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా పెట్రోలు ధరలు పెంచడాన్ని ప్రభుత్వం వాయిదావేస్తూ వచ్చిన నేపథ్యంలో ‘మినీ జనరల్ ఎన్నికలు’గా భావించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోలు ధరను లీటరుకు 5 రూపాయలకు పైగా పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

అయితే, పెంపు అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ‘మేము పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల 10 పైసలు నష్టపోతున్నాం’ అని ఓ చమురు కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసినందున ధరల సవరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్‌కు 109 డాలర్లు ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్ , బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్‌లు పెట్రోలు ధరలను పెంచాయి. తర్వాత ఇప్పటివరకు ధరల్లో మార్పు చేయలేదు. కాగా, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్‌కు 130.71 డాలర్లకు చేరుకుంది. ఏవిధంగా చూసినా పెట్రోలు ధరలు పెరగడం తప్పనిసరని. అయితే ఎంతమేరకు పెంచాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని ఆ అధికారి చెప్పారు.

యుపి సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన విధంగా ఫలితాలు లభించక పోవడంతో ఈనెల 12న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే పెట్రోలు ధరలు పెంచడానికి యుపిఏ ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుమతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్, వంటగ్యాస్ ధరలను కూడా పెంచాలని చమురు కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలాంటి కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ప్రాతినిధ్యం ఉన్న మంత్రుల సాధికారిక కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ రెండు పార్టీలు కూడా డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచడానికి అంగీకరించని విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajanarasimha is the deputy cm
Danam turns into assembly rowdy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles