Gangulu

Gangulu.GIF

Posted: 02/29/2012 01:29 PM IST
Gangulu

Ganguluశవం లేచి రావడం ఏంటి ? అదేమన్నా సినిమానా ? చనిపోయిన వారు లేచిరావడం ఏమిటి ? అంటే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం తల్వేద గ్రామంలో నిజంగానే ఈ వింత జరిగింది. చనిపోయిందనుకున్నఆమె లేచి వచ్చింది. వివరాల్లోకి వెళితే గంజాల గంగు (65) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. మంగళవారం ఉదయం చనిపోయిందని కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. బంధువులకు సమాచారం అందించారు. మరోవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

చివరిచూపు కోసం కూర్చోబెట్టేందుకు ఏర్పాట్లుచేస్తుండగా, గంగులో ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. కళ్లు తెరచిన గంగు.. లేచి నీళ్లు తాగడంతో ఆశ్చర్యపోయారు. కాగా, అయితే గంగు రెండు గంటల తర్వాత మళ్లీ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు స్థానిక వైద్యులు చిక్సిత చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leaders devotion towards common man
Maoist top rk in malkangiri forest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles