French village for sale

French village for sale,Property News,Property,French village complete stables tennis courts swimming pool sale just 275 000,Jean-Pierre Chateau

French village for sale

French.gif

Posted: 02/23/2012 01:49 PM IST
French village for sale

French village for sale

అమ్మకానికి ఇల్లు.. అమ్మకానికి కారు.. అమ్మకానికి అది.. అమ్మకానికి ఇది... అంటూ మీరు సవాలక్ష ప్రకటనలు చూసే ఉంటారుగానీ, ఇది మరీ విడ్డూరం! ఫ్రాన్సులో ఏకంగా ఒక ఊరు మొత్తం అమ్మకానికి సిద్ధమైంది. అదీ ఎక్కడో మారుమూల కాదు... ఆ దేశం నడిబొడ్డున ఉన్న చిన్న పల్లెటూరు కౌర్‌బెఫీ. 

ఈ ఊరికి సమీపంలో 13వ శతాబ్దం నాటి కోట శిథిలాలు, ఒక పురాతన చాపెల్ కూడా ఉన్నాయి. అమ్మకానికి పెట్టిన ఊరంటే పాడుబడిపోయిందనుకునేరు... ఎంచక్కా 19 ఇళ్లు, స్విమ్మింగ్‌పూల్, ఒక కమ్యూనిటీ హాలు, టెన్నిస్ కోర్టులు, గుర్రాల శాలలు... కాస్తంత మంచు ఎక్కువగానీ, ఆ వైభోగమే వేరులే! ఇన్ని ఉన్నాయి కదాని రేటు ఎక్కువ అనుకుంటే పొరబాటే! ధర బహు సరసం. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే... రూ.కోటీ తొంభై రెండు లక్షల చిల్లర!! మరీ ఇంత చీపా అని ఆశ్చర్యపోకండి.. ఇంకా చాలా ఉంది. ఈ ఊరికి దగ్గరలో, అంటే 30 కిలోమీటర్ల దూరంలో లైమోజెస్ అనే పెద్ద పట్టణం ఉంది.

అక్కణ్నుంచి అక్కణ్నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. మరి ఇన్ని హంగులున్న ఈ ఊరికి ఇంత దుర్గతి ఎందుకు పట్టిందో తెలుసా? వలసల కారణంగా! 1970ల్లో ఇక్కడి యువత ఉద్యోగాల కోసం పట్టణాల బాట పట్టడం, పిల్లలు అక్కడ స్థిరపడి తల్లిదండ్రులను తమ వద్దకు రప్పించుకుంటుండడంతో... రెండు దశాబ్దాల్లో ఊరు ఖాళీ అయిపోయింది. దీంతో ఫ్రాన్సు ప్రభుత్వం 1990ల్లో ఈ ఊరిని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రణాళికలు వేసిందిగానీ కుదరలేదు. క్రమేపీ దొంగలు, జూదరులు, తాగుబోతులకు ఈ ఊరు ఆవాసమైపోయింది. ఇక, కౌర్‌బెఫీకి పూర్వవైభవం రావాలంటే దాన్ని అమ్మేయడమే మార్గమని నిశ్చయించిన ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లో పడింది. సంబంధిత అధికార వర్గాలు సోమవారమే ఈ అమ్మకం ప్రకటన చేసినప్పటికీ ఇంతవరకూ ఎవరూ కొనడానికి ముందుకురాకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Subramanian swamy files petition in sc
Now a gel to repair tissue damaged by heart attacks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles