Salman khurshid speaks to prime minister says ready to

Salman Khurshid speaks to Prime Minister, says ready to,Election Commission, Khurshid, LK Advani, Minority quota, Minority quota row, Reservations, Salman Khurshid, UP polls

Salman Khurshid speaks to Prime Minister, says ready to

Salman.gif

Posted: 02/13/2012 11:42 AM IST
Salman khurshid speaks to prime minister says ready to

Salman Khurshid speaks to Prime Minister says ready toకేంద్ర ఎన్నికల సంఘం తనపై రాష్టప్రతికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖుర్షీద్ తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌కు శనివారం తీవ్ర పదజాలంతో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను రాష్టప్రతి  తగు చర్యలు తీసుకోవడం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లక్నోలో ఉన్న ఖుర్షీద్ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఈ ఇద్దరూ ఏమి మాట్లాడారో మాత్రం తెలియరాలేదు. కానీ తాను ఎన్నికల కమిషన్‌ను ధిక్కరించలేదని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఖుర్షీద్ మన్మోహన్‌తో చెప్పినట్లు టీవీ వార్తాచానళ్లు పేర్కొన్నాయి. పార్టీలోని ప్రతి ఒక్కరు కూడా ప్రజా జీవిత నియమాలకు, ఈ దేశ చట్టాలకు అనుగుణంగా మాట్లాడాలని అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం చీఫ్ జనార్దన్ ద్వివేది ఆదివారం పరోక్షంగా ఖుర్షీద్ వైఖరిని తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుర్షీద్ ప్రధానితో మాట్లాడడం ప్రాధాన్యంతను సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi police ready to take on moral police on valentine s day
Ap governor narasimhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles